☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
వేగంగా దూసుకొస్తున్న కారు.. ఆపి చెక్ చేసిన పోలీసుల మైండ్‌బ్లాక్..! • అబీయేలోని మార్కెట్‌పై డ్రోన్ దాడి: 153 మంది మృతి • పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో సీట్లు • Son of Kanaka Durgamma : అమ్మవారి అవతారంలో లయ.. ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ పోస్టర్ అదిరిందిగా! • Ration Card : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రేషన్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త.. • సౌరవ్ దాస్,అశుతోష్ రాంకాలపై నమోదైన రెండో కేసు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ • పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి.. సీఎం రేవంత్ కీలక ప్రకటన • ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు! •

United Nations: మాన‌వ హ‌క్కుల నిపుణుల ఆందోళ‌న‌.. ఐక్య‌రాజ్య‌స‌మితి వైఖ‌రిని ఖండించిన భార‌త్

United Nations: మాన‌వ హ‌క్కుల ఆధారంగా రాజకీయ వ‌త్తిళ్ల‌కు పాల్ప‌డ‌రాదు అని, కొన్ని దేశాల‌ను టార్గెట్ చేయ‌రాదు అని భార‌త్ అభిప్రాయ‌ప‌డింది. జెనీవాలో జ‌రుగుతున్న ఐక్య‌రాజ్య‌స‌మితి అసెంబ్లీ స‌మావేశాల్లో భార‌త ప్ర‌తినిధి బ‌ర్కా తామ్రాక‌ర్ త‌న ప్ర‌క‌ట‌న‌లో ఈ విష‌యాన్ని పేర్కొన్నారు.
United Nations: మాన‌వ హ‌క్కుల నిపుణుల ఆందోళ‌న‌.. ఐక్య‌రాజ్య‌స‌మితి వైఖ‌రిని ఖండించిన భార‌త్

జెనీవా: మాన‌వ హ‌క్కుల ఆధారంగా రాజకీయ వ‌త్తిళ్ల‌కు పాల్ప‌డ‌రాదు అని, కొన్ని దేశాల‌ను టార్గెట్ చేయ‌రాదు అని భార‌త్ అభిప్రాయ‌ప‌డింది. జెనీవాలో జ‌రుగుతున్న ఐక్య‌రాజ్య‌స‌మితి(United Nations) అసెంబ్లీ స‌మావేశాల్లో భార‌త ప్ర‌తినిధి బ‌ర్కా తామ్రాక‌ర్ త‌న ప్ర‌క‌ట‌న‌లో ఈ విష‌యాన్ని పేర్కొన్నారు. ఇటీవ‌ల ఢిల్లీలో జ‌రుగుతున్న నిర‌స‌న ప‌ట్ల యూఎన్‌లోని కొన్ని దేశాలు ఆందోళ‌న వ్య‌క్తం చేశాయి. శాంతియుతంగా ధ‌ర్నా చేస్తున్న విద్యార్థుల‌పై పోలీసులు వ‌త్తిడి తెస్తున్న‌ట్లు సుమారు 20 యూఎన్ మాన‌వ హ‌క్కుల నిపుణులు పేర్కొన్నారు. కేంద్ర విదేశాంగ శాఖ డిప్యూటీ కార్య‌ద‌ర్శి బ‌ర్కా తామ్రాక‌ర్ మాట్లాడుతూ అంత‌ర్జాతీయ మాన‌వ హ‌క్కుల వ్య‌వ‌స్థ‌ల‌తో భార‌త్ ప‌నిచేస్తున్న‌ద‌ని, కానీ చ‌ర్చ‌, సంప్ర‌దింపులు, స‌హ‌కారం ఆధారంగా ఆ స‌హ‌వాసం కొన‌సాగాల‌ని, పార‌ద‌ర్శ‌కంగా మార్గ‌ద‌ర్శ‌క సూత్రాల‌ను పాటించాల్సి ఉంటుంద‌ని ఆమె అన్నారు.

రాజ‌కీయ వ‌త్తిడి తెచ్చేందుకు కానీ దేశాన్ని టార్గెట్ చేసేందుకు కానీ మాన‌వ హ‌క్కుల‌ను ప‌రిక‌రంగా వాడుకోరాదు అని ఆమె త‌న ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. మంగ‌ళ‌వారం జెనీవాలో జ‌రిగిన యూఎన్ జ‌న‌ర‌ల్ అసెంబ్లీ థార్డ్ క‌మిటీ మీటింగ్‌లో తామ్రాక‌ర్ ఈ ప్ర‌క‌ట‌న చేశారు. వ‌ర్కింగ్ గ్రూప్ ఆన్ ఎన్‌ఫోర్స్డ్ డిస‌ప్పియ‌రెన్సెస్ అన్న ఎజెండా అంశంపై మాట్లాడుతున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

#IndiaAtUN

@BarkhaTamrakar, Deputy Secretary @MEAIndia delivered 🇮🇳’s statement at UNGA Third Committee on the Agenda Item “Working Group on Enforced Disappearances” the following :

➡ Reaffirmed that Article 21, habeas corpus, the NHRC and State Human Rights Commissions, independent media and civil society provide safeguards, transparency and avenues for redressal against enforced disappearances.

➡ Called enforced disappearances grave human-rights violations and urged prevention, accountability and protection of civil society.

➡ Noted that 🇮🇳 has signed the Convention on Enforced Disappearances and stressed that law enforcement is bound by law.

➡ 🇮🇳 called for engagement based on dialogue, cooperation, non-selectivity and transparency.

@PMOIndia @IndianDiplomacy @PIB_India @airnewsalerts @DDNewslive

— India at UN, NY (@IndiaUNNewYork) October 21, 2026

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Congress | కాంగ్రెస్‌ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!Smart Phone Tips | మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? ఈ సెట్టింగ్స్ మార్చి చూడండి →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com