☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

ఆసియా క్రీడల్లో భారత్–పాక్ ఢీ.. ఫైనల్లోనేనా? ఎప్పుడు, ఎక్కడ మ్యాచ్ అంటే!

ఆసియా క్రీడల్లో భారత్–పాక్ ఢీ.. ఫైనల్లోనేనా? ఎప్పుడు, ఎక్కడ మ్యాచ్ అంటే!
ఆసియా క్రీడల్లో భారత్–పాక్ ఢీ.. ఫైనల్లోనేనా? ఎప్పుడు, ఎక్కడ మ్యాచ్ అంటే!
ఆసియా క్రీడల్లో భారత్–పాక్ ఢీ.. ఫైనల్లోనేనా? ఎప్పుడు, ఎక్కడ మ్యాచ్ అంటే!

India vs Pakistan: జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా 20వ ఆసియా క్రీడల (Asian Games 2026) సందడి స్టార్ట్ అయింది. ఈ మెగా ఈవెంట్‌లో అత్యంత ఆదరణ పొందిన మెన్స్ క్రికెట్ పోటీలు సెప్టెంబర్ 24 నుంచి అధికారికంగా మొదలవుతున్నాయి. తొలి పోరులో ఆతిథ్య జపాన్ జట్టు, ఆసియా పవర్ హౌస్ ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనుంది. ఆసియా క్రీడల చరిత్రలో క్రికెట్ జరగడం ఇది నాలుగోసారి కాగా, ఈసారి మొత్తం 10 దేశాల జట్లు స్వర్ణ పతకం కోసం హోరాహోరీగా పోటీపడుతున్నాయి. ఈ టోర్నీలో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నది మాత్రం భారత్ vs పాకిస్తాన్ పోరు కోసమే.. కానీ ఈ రెండు జట్ల మధ్య పోటీ జరుగుతుందా లేదా తెలియక కన్ఫ్యూజన్ లో పడ్డారు.

స్వర్ణ పతకం కోసం 10 జట్లు పోటీ:

ఈసారి ఆసియా గేమ్స్ క్రికెట్ ఈవెంట్‌లో పతకాల కోసం 10 జట్లు బరిలోకి దిగుతున్నాయి. అంతర్జాతీయ ర్యాంకింగ్‌ల ఆధారంగా టీమిండియా (భారత్), పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించాయి. ఐసీసీ పూర్తి స్థాయి సభ్యత్వ జట్టుగా ఆఫ్ఘనిస్తాన్ నేరుగా లక్కీ డ్రాలో స్థానం దక్కించుకోగా, ఆతిథ్య దేశంగా జపాన్‌కు డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చింది. గత జూన్‌లో జరిగిన ఆసియా క్రీడల క్వాలిఫికేషన్ రౌండ్ ద్వారా హాంగ్‌కాంగ్, మలేషియా, నేపాల్, ఒమన్ టీమ్స్ ప్రధాన డ్రాకు అర్హత సాధించాయి.

టోర్నమెంట్ ఫార్మాట్ ఇదే:

ఐసీసీ ర్యాంకింగ్‌లలో వెనుకబడిన ఆరు జట్లు – జపాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, ఒమన్, మలేషియా, హాంగ్‌కాంగ్, రెండు గ్రూపులుగా విడిపోయి రౌండ్-రాబిన్ పద్ధతిలో పోటీ పడనున్నాయి.

* క్వార్టర్ ఫైనల్స్: ఈ రెండు గ్రూపుల నుంచి మొదటిస్థానంలో నిలిచిన రెండు టీమ్స్ క్వార్టర్ ఫైనల్స్‌కు వెళ్తాయి.

* పోటీ: అక్కడే ఆ నాలుగు జట్లు నేరుగా అర్హత సాధించిన భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో తలపడనున్నాయి. అనంతరం సెమీఫైనల్స్, ఫైనల్ పోరు కొనసాగనుంది.

అక్టోబర్ 3న భారత్– పాక్ ఫైట్:

* షెడ్యూల్ ప్రకారం భారత్, పాకిస్తాన్ జట్లు గ్రూప్ దశలో కానీ, క్వార్టర్ ఫైనల్స్‌లో కానీ పోటీ పడే ఛాన్స్ ఏమాత్రం లేదు. రెండూ వేర్వేరు విభాగాల్లో ఉన్నందున నాకౌట్ దశలోనే ఇరు జట్లు తలపడే అవకాశం కనిపిస్తుంది.

* గోల్డ్ మెడల్ మ్యాచ్ (అక్టోబర్ 3): భారత్, పాకిస్తాన్ జట్లు తమ క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్ మ్యాచ్‌లలో విజయం సాధిస్తే, అక్టోబర్ 3న జరిగే డ్రీమ్ ఫైనల్ (స్వర్ణ పతక పోరు)లో పోటీ పడతాయి.

* బ్రోంజ్ మెడల్ మ్యాచ్ (అక్టోబర్ 3): ఒకవేళ దురదృష్టవశాత్తూ ఇరు జట్లు సెమీఫైనల్స్‌లో ఓడిపోతే, అక్టోబర్ 3నే జరిగే కాంస్య పతక (Bronze Medal) మ్యాచ్‌లో ఇండియా– పాక్ తలపడతాయి.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← ఫోటో ఫీచర్: నిమజ్జనానికి సిద్ధమైన ఖైరతాబాద్ మహాగణపతి..ఆత్మహత్య చేసుకున్న .. ఐఐటీ ముంబై విద్యార్థి పేరెంట్స్ నిరాహారదీక్ష →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com