☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

గోల్డ్ కోసం దాయాదుల పోరు.. ఆసియా గేమ్స్ ఫైనల్లో భారత్ vs పాకిస్థాన్!

గోల్డ్ కోసం దాయాదుల పోరు.. ఆసియా గేమ్స్ ఫైనల్లో భారత్ vs పాకిస్థాన్! Caption of Image. India vs Pakistan: ఆసియా క్రీడల (Asian Games 2026) పురుషుల క్రికెట్ సెమీఫైనల్స్‌లో శ్రీలంకపై భారత్ అద్భుత విజయం సాధించింది. లంకను కేవలం 45 పరుగులకే కుప్పకూల్చి, 124 పరుగుల భారీ తేడాతో ఘన విజయం నమోదు చేసింది. ఈ గెలుపుతో టీమిండియా ఫైనల్‌లోకి ప్రవేశించి, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ జట్టుతో స్వర్ణ పతకం (Gold Medal) కోసం తలపడేందుకు సిద్ధమైంది. అసలు సిసలు పోరు: భారత్ vs పాకిస్థాన్ ఫైనల్: అక్టోబర్ 3వ తేదీన జరగనున్న ఫైనల్ మ్యాచ్ కేవలం క్రికెట్ పోరును మించి సరికొత్త ఉత్కంఠను రేకెత్తిస్తోంది. క్రికెట్ గణాంకాల పరంగా పాకిస్థాన్‌పై భారత్‌దే పూర్తి ఆధిపత్యం ఉన్నప్పటికీ, ఈసారి ఎలాంటి ఒత్తిడి లేని సరికొత్త పాక్ జట్టు బర
గోల్డ్ కోసం దాయాదుల పోరు.. ఆసియా గేమ్స్ ఫైనల్లో భారత్ vs పాకిస్థాన్!
గోల్డ్ కోసం దాయాదుల పోరు.. ఆసియా గేమ్స్ ఫైనల్లో భారత్ vs పాకిస్థాన్!

India vs Pakistan: ఆసియా క్రీడల (Asian Games 2026) పురుషుల క్రికెట్ సెమీఫైనల్స్‌లో శ్రీలంకపై భారత్ అద్భుత విజయం సాధించింది. లంకను కేవలం 45 పరుగులకే కుప్పకూల్చి, 124 పరుగుల భారీ తేడాతో ఘన విజయం నమోదు చేసింది. ఈ గెలుపుతో టీమిండియా ఫైనల్‌లోకి ప్రవేశించి, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ జట్టుతో స్వర్ణ పతకం (Gold Medal) కోసం తలపడేందుకు సిద్ధమైంది.

అసలు సిసలు పోరు: భారత్ vs పాకిస్థాన్ ఫైనల్:

అక్టోబర్ 3వ తేదీన జరగనున్న ఫైనల్ మ్యాచ్ కేవలం క్రికెట్ పోరును మించి సరికొత్త ఉత్కంఠను రేకెత్తిస్తోంది. క్రికెట్ గణాంకాల పరంగా పాకిస్థాన్‌పై భారత్‌దే పూర్తి ఆధిపత్యం ఉన్నప్పటికీ, ఈసారి ఎలాంటి ఒత్తిడి లేని సరికొత్త పాక్ జట్టు బరిలో నిలిచింది. నైపుణ్యాల పరంగా చూస్తే ఇండియన్ టీమ్ ఆధిక్యంలో ఉంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న సున్నితమైన రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత జట్టు పాక్ ఆటగాళ్లతో కరచలనం (handshakes) చేసేందుకు నిరాకరించడం, అలాగే ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) చీఫ్, పీసీబీ (PCB) అధ్యక్షుడు అయిన మొహిసిన్ నఖ్వీ టీమిండియాకు ట్రోఫీలు అందించేందుకు నిరాకరించడం వంటి పరిణామాలు ఈ పోరును మైదానానికి వెలుపల కూడా చర్చనీయాంశంగా మార్చాయి.

స్వర్ణ పతకాల వేటలో భారత్:

ఇదిలాఉంటే, ఇప్పటికే భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. ఇప్పుడు పురుషుల జట్టు కూడా అదే జోరును కొనసాగిస్తూ, గత ఏడిషన్‌లో గెలుచుకున్న బంగారు పతకాన్ని కాపాడుకోవడంతో పాటు ప్రస్తుత ఆసియా క్రీడల్లో మరో పసిడిని సాధించేందుకు అడుగు దూరంలో నిలిచింది.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← సనత్‌నగర్ TIMS లో OT సేవలు ప్రారంభం..ఇక నుంచి పూర్తి స్థాయి వైద్య సేవలుబ్యూటీ ప్రొడక్ట్స్, షాంపూలు, సబ్బుల్లో ఈ కెమికల్స్ ఉంటే వెంటనే వాడటం ఆపేయండి.. : ఎక్స్పర్ట్స్ వార్నింగ్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com