☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

IND vs WI 1st ODI: 5+2+4.. వెస్టిండీస్‌తో తొలి వన్డే కోసం టీమిండియా ప్లేయింగ్ 11 ఇదిగో..!

India vs West Indies 1st ODI: భారత్, వెస్టిండీస్ మధ్య ఈ నెల 27 నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది. తిరువనంతపురం వేదికగా జరిగే తొలి వన్డే కోసం టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. శుభమన్ గిల్ కెప్టెన్‌గా, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా బరిలోకి దిగుతారు.
IND vs WI 1st ODI: 5+2+4.. వెస్టిండీస్‌తో తొలి వన్డే కోసం టీమిండియా ప్లేయింగ్ 11 ఇదిగో..!

India vs West Indies 1st ODI: భారత్, వెస్టిండీస్ మధ్య ఆసక్తికరమైన క్రికెట్ సిరీస్‌కు రంగం సిద్ధమైంది. ఈ నెల 27 నుంచి ఇరు జట్ల మధ్య 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్ జరగనుంది. తొలుత వన్డే సిరీస్ తో ఈ పర్యటన ప్రారంభమవుతుంది. ఈ సిరీస్ లో భాగంగా తొలి వన్డే ఈ నెల 27న కేరళలోని తిరువనంతపురం వేదికగా జరగనుంది. శుభమన్ గిల్ సారధ్యంలోని టీమిండియా బృందం ఇప్పటికే కేరళకు చేరుకోగా, ఇవాళ కోహ్లీ, రోహిత్ శర్మలు జట్టులో చేరారు.

టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించినట్లుగా చెబుతున్న రోకో ద్వయం (రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ) 2027 వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకొని కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నారు. ఇటీవలే ఇంగ్లాండ్‌కు వన్డే సిరీస్ కోల్పోయినప్పటికీ, రోహిత్, కోహ్లీ తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. వన్డే ప్రపంచ కప్‌కు సరిగ్గా ఏడాది సమయం మాత్రమే ఉండటంతో రోకో ద్వయంపై అందరి దృష్టి నెలకొంది.

ఎక్కువమంది చదివినది: ఒక్కో మ్యాచ్‌కు రూ. 19 కోట్లకుపైగానే.. ఖాళీ చేతులతో వచ్చి ఎన్ని కోట్లు పట్టుకెళ్లారంటే?

ఇక ఆసియా క్రీడల కోసం టీ20 జట్టు ఇప్పటికే జపాన్‌కు చేరుకోవడంతో, వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు జట్టులో కొన్ని మార్పులు అనివార్యమయ్యాయి. దీని కారణంగా ఆకీబ్ నబీ, నమన్ ధీర్ వంటి కొత్త ఆటగాళ్లను జట్టుకు ఎంపిక చేయాల్సి వచ్చింది. ఆరు నెలల తర్వాత సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మళ్లీ వన్డే మ్యాచ్ ఆడనుండటం విశేషం.

ఈ వన్డే సిరీస్‌కు జస్ప్రీత్ బుమ్రా కూడా అందుబాటులో లేరు. గోల్డ్ మెడల్ కోసం జపాన్ పర్యటనలో ఆసియా గేమ్స్‌లో పాల్గొనే టీ20 జట్టులో ఆయన ఉన్నారు. ఈ క్రమంలో పెద్దగా అనుభవం లేని బౌలర్లతో ఈ వన్డే సిరీస్ ఆడనుంది టీమిండియా. గున్నూర్ బార్, ఆకీబ్ నబీ వంటి వారు కొత్త ఆటగాళ్లు కావడంతో, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలతో కలిసి వీరు బౌలింగ్‌లో ఎలా రాణిస్తారో చూడాలి.

మొత్తంగా అంచనా ప్రకారం తిరువనంతపురం వేదికగా జరగబోయే తొలి వన్డే కోసం టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇలా ఉండబోతోంది. కెప్టెన్‌గా శుభమన్ గిల్, వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ బరిలోకి దిగడం ఖాయం. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండడం ఖాయం. అయితే మరోసారి యశస్వి జైస్వాల్‌కు నిరాశ తప్పకపోవచ్చు. ఐదవ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ కు చోటు ఖాయం కాగా, ఆరు, ఏడు స్థానాల్లో నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజాలకు చోటు దక్కనుంది.

ఎక్కువమంది చదివినది: వీళ్లంతా భారత్‌లోనే హీరోలు.. విదేశాల్లో జీరోలు.. టీమిండియా ప్లేయర్లపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..!

మెయిన్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ జట్టులో ఉంటారు. ముగ్గురు ఫాస్ట్ బౌలర్లుగా ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, గున్నూర్ బార్ లేదా ఆకీబ్ నబీలలో ఒకరికి అవకాశం దక్కనుంది. మొత్తంగా ఐదు మంది బ్యాట్స్‌మెన్‌లు, ఇద్దరు ఆల్ రౌండర్‌లు, నలుగురు మెయిన్ బౌలర్లతో టీమిండియా బరిలోకి దిగనుంది. తుది ప్లేయింగ్ ఎలెవన్ లో శుభమన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, గున్నూర్ బార్ ఉండే అవకాశం ఉంది. ఈ జట్టు కూర్పు వెస్టిండీస్ పై ఎలా రాణిస్తుందో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← గంటల ప్రయాణం.. నిమిషాల్లో గమ్యం.. భారత్‌లో మారుతున్న ప్రయాణ ముఖచిత్రం..ట్రంప్ బెదిరింపులకు ఇరాన్ అదిరిపోయే కౌంటర్.. బాలయ్య వీడియోతో షాకింగ్ రిప్లై! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com