☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

ట్రంప్ బెదిరింపులకు ఇరాన్ అదిరిపోయే కౌంటర్.. బాలయ్య వీడియోతో షాకింగ్ రిప్లై!

ఐక్యరాజ్యసమితి వేదికగా అమెరికా, ఇరాన్‌ మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. ట్రంప్‌ ఇరాన్‌ అణు కార్యక్రమంపై హెచ్చరించగా, ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ దౌత్యానికి తలుపులు తెరిచే ఉన్నాయని, కానీ ఒత్తిడికి లొంగమని స్పష్టం చేశారు. బల ప్రయోగాన్ని ఎదుర్కోవడానికి ఇరాన్‌ సిద్ధంగా ఉందని జింబాబ్వేలోని ఇరాన్‌ రాయబార కార్యాలయం తెలుగు సినిమా యాక్షన్‌ సన్నివేశంతో కౌంటర్‌ ఇవ్వడం చర్చనీయాంశమైంది.
ట్రంప్ బెదిరింపులకు ఇరాన్ అదిరిపోయే కౌంటర్.. బాలయ్య వీడియోతో షాకింగ్ రిప్లై!

ఐక్యరాజ్యసమితి వేదికగా అమెరికా, ఇరాన్‌ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. సెప్టెంబర్‌ 22న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌పై తీవ్ర హెచ్చరికలు జారీ చేయగా.. మరుసటి రోజు అదే వేదికపై ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ ధీటుగా స్పందించారు. అణు కార్యక్రమాన్ని వదులుకోవాలన్న ఒత్తిడికి తాము తలొగ్గబోమని స్పష్టం చేస్తూనే.. దౌత్యానికి మాత్రం తలుపులు తెరిచే ఉంచామన్నారు.

ట్రంప్‌ తన ప్రసంగంలో ఇరాన్‌ అణ్వస్త్రాలను అభివృద్ధి చేయకుండా అడ్డుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తూ, ఒప్పందం కుదరకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని పెంచేందుకు ప్రపంచ దేశాలు సహకరించాలని పిలుపునిచ్చారు. దీనికి స్పందించిన పెజెష్కియాన్‌.. అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌ ప్రజలే బాధితులుగా మిగిలారని ఆరోపించారు. తమను ఉగ్రవాదులుగా చిత్రీకరించడం సరికాదని, తామే ఉగ్రవాదానికి బాధితులమని అన్నారు. తన ప్రసంగంలో మినాబ్‌లోని బాలికల పాఠశాలపై జరిగిన దాడిలో మృతి చెందిన చిన్నారుల ఫొటోలను, మాజీ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ చిత్రాన్ని ప్రదర్శించారు.

అదే సమయంలో ఇరాన్‌ అధ్యక్షుడు శాంతి, చర్చలు, దౌత్యానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అయితే బలప్రయోగం, బెదిరింపుల భాషలో చర్చలు జరపలేమని స్పష్టం చేశారు. ఆంక్షలు లేదా సైనిక చర్యల ఒత్తిడికి తమ అణు కార్యక్రమాన్ని వదులుకునే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు.

బాలయ్య వీడియోతో ట్రంప్‌నకు ఇరాన్‌ కౌంటర్‌!

ఇదిలా ఉండగా, అమెరికా–ఇరాన్‌ ఉద్రిక్తతలో తెలుగు సినిమా ఊహించని విధంగా తెరపైకి వచ్చింది. జింబాబ్వేలోని ఇరాన్‌ రాయబార కార్యాలయం సోషల్ మీడియా ‘ఎక్స్‌’లో నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్‌ కేసరి’ సినిమాలోని యాక్షన్‌ సన్నివేశాన్ని పోస్టు చేసింది. ఇరాన్‌ను నాశనం చేస్తామని ట్రంప్‌ మాట్లాడుతున్నప్పటికీ.. ఇరాన్‌ తనను తాను రక్షించుకోలేని దేశం కాదనే భావనను ఆ వీడియో ద్వారా వ్యక్తం చేసింది. అయితే రాయబార కార్యాలయం పోస్టులో ఆ సినిమాను ‘బాలీవుడ్‌’గా పేర్కొన్నప్పటికీ, ‘భగవంత్‌ కేసరి’ తెలుగు సినిమా కావడం గమనార్హం. ట్రంప్‌ హెచ్చరికలకు ఇరాన్‌ ఇచ్చిన ఈ సినీ తరహా స్పందన ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← IND vs WI 1st ODI: 5+2+4.. వెస్టిండీస్‌తో తొలి వన్డే కోసం టీమిండియా ప్లేయింగ్ 11 ఇదిగో..!యమునా ఎక్స్‌ప్రెస్‌వే బస్సు ప్రమాదం: ప్రయాణికులు చెప్పినా వినని డ్రైవర్.. ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com