☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Asian Games: సెమీస్‌లో శ్రీలంక‌పై భార‌త్ ఘ‌న విజ‌యం.. శ‌నివారం పాకిస్థాన్‌తో గోల్డ్ మెడ‌ల్ మ్యాచ్‌

Asian Games: దాయాదుల స‌మ‌రానికి వేదిక రెఢీ అయ్యింది. ఇండియా, పాక్ మ‌రోసారి త‌ల‌ప‌డ‌నున్నాయి. ఏషియ‌న్ గేమ్స్ టీ20 క్రికెట్‌లో ఆ రెండు జ‌ట్లు ఫైన‌ల్స్‌కు ప్ర‌వేశించాయి. బంగ్లాపై పాక్‌, లంక‌పై భార‌త్ ఇవాళ నెగ్గాయి. ఇండో, పాక్ మ‌ధ్య శ‌నివారం గోల్డ్ మెడ‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నున్న‌ది.
Asian Games: సెమీస్‌లో శ్రీలంక‌పై భార‌త్ ఘ‌న విజ‌యం.. శ‌నివారం పాకిస్థాన్‌తో గోల్డ్ మెడ‌ల్ మ్యాచ్‌

న‌గోయా: ఏషియ‌న్ గేమ్స్‌(Asian Games)లో బిగ్ క్లాష్ జ‌ర‌గ‌నున్న‌ది. టీ20 స‌మ‌రంలో దాయాదులు పాకిస్థాన్‌, భార‌త్ శ‌నివారం త‌ల‌ప‌డ‌నున్నాయి. ఇవాళ జ‌రిగిన రెండో సెమీస్ మ్యాచ్‌లో భార‌త్ జ‌ట్టు 124 ర‌న్స్ తేడాతో శ్రీలంక‌పై ఘ‌న విజ‌యం సాధించింది. జ‌పాన్‌లోని నిషిన్‌లో జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త్ పూర్తి ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన భార‌త జ‌ట్టు 7 వికెట్ల న‌ష్టానికి 169 ర‌న్స్ చేసింది. అయితే చేజింగ్‌లో శ్రీలంక చితికిల‌ప‌డింది. కేవ‌లం 9.5 ఓవ‌ర్ల‌లో 45 ర‌న్స్‌కే ఆలౌటైంది. భార‌త బౌల‌ర్ల‌లో బుమ్రా, అక్ష‌ర్ ప‌టేల్‌, అభిషేక్ శ‌ర్మ రెండేసి వికెట్లు తీసుకున్నారు.

ప‌రుగులు రాబ‌ట్ట‌డం క‌ష్టంగా ఉన్న పిచ్‌పై భార‌త బ్యాట‌ర్లు తొలుత త‌డ‌బ‌డ్డారు. ఇషాన్ కిష‌న్ చాక‌చ‌క్యంగా బ్యాటింగ్ చేశాడు. 46 బంతుల్లో 80 ర‌న్స్ చేసి అత‌ను నాటౌట్‌గా నిలిచాడు. ఇక ఓపెన‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ కూడా కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. 21 బంతుల్లో సూర్య‌వంశీ 38 ర‌న్స్ చేశాడు. అత‌ని ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, రెండు సిక్స‌ర్లు ఉన్నాయి. 170 టార్గెట్‌తో చేజింగ్‌కు దిగిన శ్రీలంక ఏ ద‌శ‌లోనూ భార‌త బౌల‌ర్ల‌ను ఎదుర్కోలేక‌పోయింది. అయిదుగురు లంక బ్యాట‌ర్లు డ‌కౌట్ అయ్యారు. ఫెర్నాండో ఒక్క‌డే రెండు అంకెల స్కోరు చేశాడు.

మ‌రో వైపు బంగ్లాదేశ్‌తో జ‌రిగిన తొలి సెమీ ఫైన‌ల్లో పాకిస్థాన్ జ‌ట్టు ఆరు వికెట్ల తేడాతో విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 13 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 111 ర‌న్స్ చేసింది. ఆ త‌ర్వాత పాకిస్థాన్ 11.3 ఓవ‌ర్ల‌లో టార్గెట్‌ను అందుకున్న‌ది. అబ్దుల్ స‌మ‌ద్ 30, న‌వాజ్ 27 ర‌న్స్ చేసి పాక్‌ను గెలిపించారు. ఇక ఇండియా, పాకిస్థాన్ జ‌ట్లు శ‌నివారం జ‌రిగే గోల్డ్ మెడ‌ల్ మ్యాచ్‌లో పోటీప‌డ‌నున్నాయి.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Collector Mrinalini | యూట్యూబ్ చూసి ప్ర‌స‌వం చాలా ప్ర‌మాద‌క‌రం.. గ‌ర్భిణీల‌కు జిల్లా క‌లెక్ట‌ర్ హెచ్చ‌రిక‌..!Rithu Chowdary | డీమాన్ పవన్–రీతూ చౌదరి మధ్య అసలేం జరిగింది .. బ్రేకప్‌పై రీతూ షాకింగ్ రియాక్షన్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com