☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Hardik Pandya: ఏంటి హార్దిక్ భయ్యా.. దరిద్రం నిన్నే పట్టుకుంది.. మళ్లీ గాయపడిన పాండ్యా

Hardik Pandya Injury: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి గాయపడ్డారు. ఆస్ట్రేలియా ఏతో జరిగే సిరీస్‌కు ఎంపికైన ఆయన ప్రాక్టీస్ సమయంలో కుడి కాలు పిక్క భాగంలో నొప్పితో బాధపడినట్లు సమాచారం. స్కానింగ్ తర్వాత వైద్యులు 10 నుంచి 15 రోజుల విశ్రాంతి సూచించినట్లు తెలుస్తోంది. దీంతో హార్దిక్ రీఎంట్రీపై సందేహాలు నెలకొన్నాయి.
Hardik Pandya: ఏంటి హార్దిక్ భయ్యా.. దరిద్రం నిన్నే పట్టుకుంది.. మళ్లీ గాయపడిన పాండ్యా

Hardik Pandya: భారత క్రికెట్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రీఎంట్రీ ఇస్తారనుకుంటే మళ్లీ తీవ్ర నిరాశ ఎదురైంది. మైదానంలోకి అడుగుపెట్టాలని ఉత్సాహంగా ఉన్న హార్దిక్‌కు గాయం మరోసారి బ్రేక్ వేసింది. అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా ఏ జాతీయ జట్టుతో జరిగే సిరీస్ కోసం హార్దిక్‌ను ఇండియా ఏ జట్టులో ఎంపిక చేశారు. అయితే ప్రాక్టీస్ సమయంలో ఆయన మళ్లీ గాయం బారిన పడ్డారు. దీంతో ఆయన రీ ఎంట్రీ పై నీలి నీడలు కమ్ముకున్నాయి.

టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. ఈ వారంలో హార్దిక్ పాండ్యా తన కుడి కాಲು పిక్క భాగంలో తీవ్రమైన నొప్పి ఉన్నట్లు ఫిర్యాదు చేశారు. దీంతో బీసీసీఐ వైద్య బృందం వెంటనే ఆయనకు కొత్తగా స్కానింగ్ పరీక్షలు నిర్వహించింది. గత కొంతకాలంగా ఈ నొప్పితో బాధపడుతున్న ఆయన, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కోలుకోవడానికి ఎంతో కష్టపడ్డారు. కానీ సమస్య పూర్తిగా తగ్గకపోవడంతో, వైద్యులు ఆయనకు మరో 10 నుంచి 15 రోజుల పాటు ఎలాంటి శారీరక శ్రమ చేయకుండా పూర్తి విశ్రాంతి తీసుకోవాలని స్పష్టంగా సూచించారు.

న్యూజిలాండ్ సిరీస్‌కు కూడా దూరం

ఆస్ట్రేలియా ‘ఏ’ సిరీస్ ద్వారా మళ్లీ ఫామ్‌లోకి వచ్చి, త్వరలో జరిగే న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వాలని హార్దిక్ భావించారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రాబోయే రెండు వారాల పాటు ఆయన మైదానానికి దూరంగా ఉండాల్సి రావడంతో కివీస్‌తో జరిగే టీ20 సిరీస్‌లోనూ ఆయన ఆడటం దాదాపు అసాధ్యంగా మారింది. ఇక ఆ తర్వాత జరిగే వన్డే సిరీస్ విషయంలోనూ సెలెక్టర్లు ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. 2027 వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని మేనేజ్‌మెంట్ ఆయన ఫిట్‌నెస్ పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.

సూర్యాంశ్‌కు అవకాశం

హార్దిక్ పాండ్యా గాయంపై బీసీసీఐ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ఆయన స్థానంలో ఆస్ట్రేలియా ‘ఏ’తో జరిగే మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు యువ ఆటగాడు సూర్యాంశ్ షెడ్గేను ఎంపిక చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సూర్యాంశ్ కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోనే శిక్షణ పొందుతున్నారు. హార్దిక్ వంటి కీలక ఆటగాడు తరచూ గాయాల బారిన పడటం టీమిండియా మేనేజ్‌మెంట్‌ను ఆందోళనకు గురిచేస్తోంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← కాళ్లు, చేతులు, తల వేరు.. విజయవాడలో యువతి హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్!42 ఏళ్ల బంధానికి కన్నీటి వీడ్కోలు.. పెళ్లికూతురిలా భార్యను అలంకరించి.. పెళ్లికొడుకుగా భర్త తుది వీడ్కోలు! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com