☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

ఇల్లెందు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ‌ స్థల సర్వే ప్రక్రియ ప‌రిశీల‌న‌

ఇల్లెందు నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం కోసం ప్రతిపాదించిన సర్వే నంబర్ 549/1లోని స్థలంలో చేపడుతున్న సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ అంకిత్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పాఠశాల నిర్మాణం కోసం ప్రతిపాదించిన స్థలానికి సంబంధించి కొంతమంది రైతులు...
ఇల్లెందు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ‌ స్థల సర్వే ప్రక్రియ ప‌రిశీల‌న‌

– సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అంకిత్ ఆదేశం

ఇల్లెందు, సెప్టెంబర్ 25 : ఇల్లెందు నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం కోసం ప్రతిపాదించిన సర్వే నంబర్ 549/1లోని స్థలంలో చేపడుతున్న సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ అంకిత్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పాఠశాల నిర్మాణం కోసం ప్రతిపాదించిన స్థలానికి సంబంధించి కొంతమంది రైతులు తమ భూములకు సంబంధించిన అభ్యంతరాలతో కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు చేపడుతున్న సర్వే ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. సర్వే నంబర్ 549/1లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల కోసం 20 ఎకరాల స్థలాన్ని ప్రతిపాదించినట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా సంబంధిత రెవెన్యూ రికార్డులు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ వివరాలు, పాత నక్షాలు, పాస్‌బుక్‌లు, భూ భారతి రికార్డులను పరిశీలించారు. రికార్డుల్లో నమోదైన వివరాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో భూమి విస్తీర్ణం, సరిహద్దులు, వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. స్థలానికి సంబంధించిన పాత రికార్డులు, సర్వే వివరాలు, నక్షాలు, ఇతర పత్రాలను సమగ్రంగా పరిశీలించి క్షేత్రస్థాయి పరిస్థితులతో సరిపోల్చాలని అధికారులను ఆదేశించారు.

సర్వే సందర్భంగా అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగా సరిహద్దులను స్పష్టంగా నిర్ధారించాలని సూచించారు. ఈ సందర్భంగా కొంతమంది రైతులు తమ వద్ద ఉన్న పాత పాస్‌బుక్‌లు, భూ సంబంధిత పత్రాలను కలెక్టర్‌కు చూపించారు. తాము గతంలో సదరు భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ వచ్చామని, తమ భూముల సరిహద్దులను స్పష్టంగా నిర్ధారించాలని కోరారు. పాఠశాల నిర్మాణానికి భూమి అవసరమైతే నిబంధనల ప్రకారం తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రైతులు సమర్పించిన పత్రాలు, సంబంధిత అధికారుల వద్ద ఉన్న రికార్డులను పరిశీలించిన కలెక్టర్, సర్వే నంబర్ 549/1లో అన్ని శాఖల సమక్షంలో సర్వేను ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి, రికార్డుల ఆధారంగా వాస్తవ సరిహద్దులను నిర్ధారిస్తూ సమగ్ర నివేదికను సమర్పించాలని రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఆర్డీవో మధు, ఇల్లెందు తాసిల్దార్ ఖాసిం, ఏడి సర్వే శ్రీనివాస్, ఇల్లెందు మున్సిపల్ కమిషనర్ సందీప్, ఎంపీడీవో ధనుసింగ్, సంబంధిత శాఖల అధికారులు, సర్వేయర్లు, రైతులు పాల్గొన్నారు.

ఇల్లెందు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ‌ స్థల సర్వే ప్రక్రియ ప‌రిశీల‌న‌

ఇల్లెందు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ‌ స్థల సర్వే ప్రక్రియ ప‌రిశీల‌న‌

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ‘విధిగా పోషకాహారం తీసుకోవాలి’Safe | వరద ఉధృతిలో కొట్టుకుపోయిన టీడీపీ ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ.. కాపాడిన బృందాలు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com