☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Bigg Boss Today Promo : డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి ‘దక్షి’..? వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చిన నాగార్జున.. ప్రోమో వైరల్.. • General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక.. • జియో ఐపీఓతో భారీ సంచలనం.. రూ.30,213 కోట్ల సమీకరణ లక్ష్యం! 5G, AIతో భవిష్యత్తు వృద్ధికి భారీ ప్లాన్‌ • Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్! • ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! • Shubman Gill : అయ్యో.. రంజీ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్‌కు బిగ్‌షాక్‌.. ఒక్క పరుగే! సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికర చర్చ • కోటి రూపాయల కరెన్సీ నోట్లతో దుర్గమ్మకు అలంకరణ.. రావులపాలెంలో అమ్మవారిని చూసేందుకు పోటెత్తిన భక్తులు! • Ram Gopal Varma : ఆ బుక్ నన్ను బాగా మోటివేట్ చేసింది.. ఆర్జీవీ చెప్పిన ఈ పుస్తకం గురించి తెలుసా..? •

IPL 2027 Mini Auction: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముహూర్తం ఖరారు.. ఈసారి వేదిక ఎక్కడో తెలుసా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన, సంపన్నమైన క్రికెట్ లీగ్‌గా పేరుగాంచింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది క్రికెట్ అభిమానులను అలరిస్తున్న ఈ పొట్టి ఫార్మాట్ లీగ్, త్వరలోనే తన 20వ సీజన్‌లోకి విజయవంతంగా అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. ప్రతీ ఏటా కొత్త ఉత్సాహాన్ని, హోరాహోరీ పోరాటాలను అందించే ఐపీఎల్, రాబోయే కొత్త సీజన్ కోసం ఇప్పటి నుంచే సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా అన్ని ఫ్రాంచైజీలు తమ జట్లను మరింత బలంగా తీర్చిదిద్దడానికి అవసరమైన […]
IPL 2027 Mini Auction: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముహూర్తం ఖరారు.. ఈసారి వేదిక ఎక్కడో తెలుసా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన, సంపన్నమైన క్రికెట్ లీగ్‌గా పేరుగాంచింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది క్రికెట్ అభిమానులను అలరిస్తున్న ఈ పొట్టి ఫార్మాట్ లీగ్, త్వరలోనే తన 20వ సీజన్‌లోకి విజయవంతంగా అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. ప్రతీ ఏటా కొత్త ఉత్సాహాన్ని, హోరాహోరీ పోరాటాలను అందించే ఐపీఎల్, రాబోయే కొత్త సీజన్ కోసం ఇప్పటి నుంచే సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా అన్ని ఫ్రాంచైజీలు తమ జట్లను మరింత బలంగా తీర్చిదిద్దడానికి అవసరమైన వ్యూహరచనలలో మునిగిపోయాయి.

మినీ వేలం, వేదిక వివరాలు
రాబోయే సీజన్ కోసం జట్ల ఎంపిక ప్రక్రియలో అత్యంత కీలకమైన మినీ వేలం పాటను ఈసారి భారతదేశంలోనే నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మందలి (బీసీసీఐ) నిర్ణయించింది. 2026 డిసెంబర్ 16న గోవాలోని ‘ఐటీసీ గ్రాండ్ గోవా’ వేదికగా ఈ మినీ వేలం జరగనుందని వార్తలు వస్తున్నాయి. గత కొన్ని సీజన్లుగా ఈ ప్రక్రియ దుబాయ్, సౌదీ అరేబియా, అబుదాబి వంటి విదేశీ వేదికలలో జరిగింది. ఈసారి మళ్లీ భారత గడ్డపై జరుగుతుండటం విశేషం. ఐపీఎల్ 2027 సీజన్ మార్చి 14 నుంచి మే 30 వరకు నిర్వహించే అవకాశం ఉంది.

జట్టు కూర్పు, రిటెన్షన్ నిబంధనలు
మినీ వేలం అనగానే అభిమానులలో అలాగే యాజమాన్యాలలో కొన్ని సందేహాలు ఉంటాయి. సాధారణంగా మెగా వేలంలో నిర్దిష్ట సంఖ్యలో మాత్రమే ఆటగాళ్లను తమ వద్ద ఉంచుకోవడానికి (రిటైన్) అవకాశం ఉంటుంది. కానీ మినీ వేలంలో అలాంటి పరిమితులేవీ ఉండవు. ఫ్రాంచైజీలు తమకు కావలసినంత మంది ఆటగాళ్లను రీటైన్ చేసుకోవచ్చు. అయితే, ప్రతీ జట్టు గరిష్టంగా 25 మంది ఆటగాళ్లను మాత్రమే తమ స్క్వాడ్‌లో ఉంచుకోవడానికి అనుమతి ఉంటుంది. అందులోనూ విదేశీ ఆటగాళ్ల సంఖ్య 8 మందికి మించకూడదు. ఫ్రాంచైజీలు తాము ఉంచుకునే (రిటైన్), అలాగే వదిలేసే (రిలీజ్) ఆటగాళ్ల జాబితాను నవంబర్ 15 నాటికి బీసీసీఐకి సమర్పించాల్సి ఉంటుంది.

ట్రేడింగ్ విండో, జట్టు పర్స్ లిమిట్
వేలం పాట ప్రారంభం కావడానికి ముందే జట్లు ఒకరితో ఒకరు ఆటగాళ్లను మార్చుకునేందుకు (ట్రేడింగ్) వీలుగా ప్రత్యేక విండో అందుబాటులో ఉంటుంది. ఈ ట్రేడింగ్ ద్వారా జట్లు తమకు కావాల్సిన ఆటగాళ్లను నేరుగా ఒప్పందం ద్వారా పొందవచ్చు. ఈ విండో వేలం ప్రారంభానికి వారం రోజుల ముందు వరకు తెరిచి ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ వేలం ముగిసిన వారం రోజులకు ప్రారంభమై టోర్నీ ప్రారంభానికి నెల రోజుల ముందు వరకు కొనసాగుతుంది.

అంతేకాకుండా.. ప్రతీ సీజన్‌కు ఆటగాళ్ల కొనుగోలు కోసం బీసీసీఐ నిర్ణయించే మొత్తం బడ్జెట్ (పర్స్‌) పరిమితి క్రమంగా పెరుగుతూ వస్తోంది. రాబోయే సీజన్ నాటికి ప్రతీ ఫ్రాంచైజీకి అందుబాటులో ఉండే జీతాల పరిమితిని రూ.157 కోట్లుగా నిర్ణయించడం జరిగింది. ఇందులో నుంచి రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జీతాల మొత్తాన్ని మినహాయించగా మిగిలిన మొత్తంతో జట్లు వేలంలో కొత్త ఆటగాళ్లను కొనుగోలు చేస్తాయి.

నిబంధనలలో మార్పులు..
ఐపీఎల్ టోర్నమెంట్ సరళిని సులభతరం చేసేందుకు, వేలం ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు కొన్ని ప్రత్యేక నిబంధనలను వర్తింపజేస్తున్నారు. మినీ వేలంలో రైట్ టు మ్యాచ్ (RTM) కార్డ్స్ అందుబాటులో ఉండవు. దీని అర్థం ఏమిటంటే.. ఒక జట్టు తమ పాత ఆటగాడిని వేలంలోకి వదిలేసిన తర్వాత, అతడిని మళ్లీ దక్కించుకోవాలంటే మిగిలిన జట్లతో సమానంగా వేలంలో పాల్గొని ఎక్కువ ధరకు పాడుకోవాల్సిందే తప్ప, నేరుగా మ్యాచింగ్ ధరతో సొంతం చేసుకునే అవకాశం ఉండదు.

అలాగే.. వేలంలో భారీ ధరకు అమ్ముడై, ఆ తర్వాత వ్యక్తిగత లేదా స్పష్టమైన కారణాలు లేకుండా టోర్నమెంట్ నుంచి తప్పుకునే ఆటగాళ్లపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోనుంది. అలాంటి వారికి లీగ్ లో పాల్గొనకుండా రెండు సీజన్ల పాటు నిషేధం విధించే ప్రతిపాదనలు ఉన్నాయి. దీనివల్ల ఫ్రాంచైజీలు ఎదుర్కొనే నష్టాలను నివారించవచ్చు.

ఇక ఇటీవల ఎంతో చర్చనీయాంశమైన ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధనపై కూడా బీసీసీఐ సమీక్ష నిర్వహిస్తోంది. ఈ నియమంపై మ్యాచ్‌లలోని ఉత్కంఠత పెరిగినప్పటికీ, ఆల్ రౌండర్ల పాత్ర తగ్గపోతోందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అందువల్ల ఈ నియమాన్ని కొనసాగించాలా లేదా అనే దానిపై కూడా త్వరలోనే స్పష్టత రానుంది. మొత్తానికి 20వ సీజన్ ఐపీఎల్ సరికొత్త ఉత్సాహంతో, వ్యూహాత్మక మార్పులతో అభిమానులకు మరోసారి క్రికెట్ విందును అందించడానికి సమాయత్తమవుతోంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Jammalamadugu-YCP: జమ్మలమడుగులో ఉద్రిక్తత.. ఇందిరమ్మ నామినేషన్‌పై ఉత్కంఠ!Naman Dhir: యువరాజ్ సింగ్ 19 ఏళ్ల రికార్డు బ్రేక్.. 6 బంతుల్లోనే నమన్ ధీర్ విధ్వంసం.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com