☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Bigg Boss Today Promo : డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి ‘దక్షి’..? వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చిన నాగార్జున.. ప్రోమో వైరల్.. • General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక.. • జియో ఐపీఓతో భారీ సంచలనం.. రూ.30,213 కోట్ల సమీకరణ లక్ష్యం! 5G, AIతో భవిష్యత్తు వృద్ధికి భారీ ప్లాన్‌ • Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్! • ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! • Shubman Gill : అయ్యో.. రంజీ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్‌కు బిగ్‌షాక్‌.. ఒక్క పరుగే! సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికర చర్చ • కోటి రూపాయల కరెన్సీ నోట్లతో దుర్గమ్మకు అలంకరణ.. రావులపాలెంలో అమ్మవారిని చూసేందుకు పోటెత్తిన భక్తులు! • Ram Gopal Varma : ఆ బుక్ నన్ను బాగా మోటివేట్ చేసింది.. ఆర్జీవీ చెప్పిన ఈ పుస్తకం గురించి తెలుసా..? •

Jammalamadugu-YCP: జమ్మలమడుగులో ఉద్రిక్తత.. ఇందిరమ్మ నామినేషన్‌పై ఉత్కంఠ!

కడప జిల్లా జమ్మలమడుగులో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సతీమణి ఇందిరమ్మ నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె నామినేషన్‌కు సంబంధించి హైకోర్టు నుంచి అనుకూల ఆదేశాలు వచ్చాయి. దీంతో నేడు జమ్మలమడుగు మున్సిపాలిటీ చైర్పర్సన్ అభ్యర్థిగా నామినేషన్ వేయాలని ఇందిరమ్మ నిర్ణయించుకున్నారు. అయితే ఇందిరమ్మను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గుండ్లకుంటలోని ఇందిరమ్మ స్వగృహం వద్ద పోలీసులు భారీగా మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. […]
Jammalamadugu-YCP: జమ్మలమడుగులో ఉద్రిక్తత.. ఇందిరమ్మ నామినేషన్‌పై ఉత్కంఠ!

కడప జిల్లా జమ్మలమడుగులో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సతీమణి ఇందిరమ్మ నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె నామినేషన్‌కు సంబంధించి హైకోర్టు నుంచి అనుకూల ఆదేశాలు వచ్చాయి. దీంతో నేడు జమ్మలమడుగు మున్సిపాలిటీ చైర్పర్సన్ అభ్యర్థిగా నామినేషన్ వేయాలని ఇందిరమ్మ నిర్ణయించుకున్నారు. అయితే ఇందిరమ్మను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గుండ్లకుంటలోని ఇందిరమ్మ స్వగృహం వద్ద పోలీసులు భారీగా మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇంటి నుంచి ఎవరినీ బయటకు వెళ్లనివ్వడం లేదని ఇందిరమ్మ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, ఇందిరమ్మ కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. చట్టప్రకారం తమకు నామినేషన్ దాఖలు చేసే హక్కు ఉందని ఇందిరమ్మ, రామసుబ్బారెడ్డి అంటున్నారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో నామినేషన్ వేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఎన్నికల ప్రక్రియలో తమకు అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు. గుండ్లకుంటలో చోటుచేసుకున్న పరిణామాలతో జమ్మలమడుగు రాజకీయ వాతావరణం వేడెక్కింది.

హౌస్ అరెస్ట్ చేయడంతో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇంతటి అరాచకమైన పరిపాలనను నేను ఎప్పుడూ చూడలేదు. నామినేషన్లు వేయడానికి కూడా ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. నామినేషన్ల ప్రక్రియలో మహిళలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. నామినేషన్ పత్రాలను చించివేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి’ అని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్ దాఖలు చేసేందుకు ఇందిరమ్మకు అవకాశం లభిస్తుందా? పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? హైకోర్టు ఆదేశాల అమలుపై అధికారులు ఎలా స్పందిస్తారు? అన్న అంశాలపై ఉత్కంఠ నెలకొంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Spirit Release Date Announced: ప్రభాస్’ రిలీజ్ డేట్ అఫీషియల్.. దీపావళికే సందీప్ వంగా మూవీ.. కానీ..IPL 2027 Mini Auction: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముహూర్తం ఖరారు.. ఈసారి వేదిక ఎక్కడో తెలుసా? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com