☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
వేగంగా దూసుకొస్తున్న కారు.. ఆపి చెక్ చేసిన పోలీసుల మైండ్‌బ్లాక్..! • అబీయేలోని మార్కెట్‌పై డ్రోన్ దాడి: 153 మంది మృతి • పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో సీట్లు • Son of Kanaka Durgamma : అమ్మవారి అవతారంలో లయ.. ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ పోస్టర్ అదిరిందిగా! • Ration Card : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రేషన్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త.. • సౌరవ్ దాస్,అశుతోష్ రాంకాలపై నమోదైన రెండో కేసు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ • పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి.. సీఎం రేవంత్ కీలక ప్రకటన • ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు! •

చీర కట్టులో.. AK 47తో IPS అంకిత శర్మ కాల్పులు

చీర కట్టులో.. AK 47తో IPS అంకిత శర్మ కాల్పులు Caption of Image. ఆయుధ పూజ.. దసరా రోజు చేసే పూజ ఇది. వారి వారి స్థోమతను బట్టి ఈ ఆయుధ పూజ చేయటం ఆనవాయితీ. ఈ క్రమంలోనే పోలీసులు అయితే తమ దగ్గర ఉంటే తుపాకులకు పూజలు చేస్తుంటారు. ఇది కామన్. ఈసారి ఇలాంటి పూజ సందర్భంగా ఓ వీడియో వైరల్ అయ్యింది. ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందామా.. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం రాజ్ నంగ్ గావ్ జిల్లా. ఆ జిల్లాకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్.. SP గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు అంకిత శర్మ. ఆయుధ పూజలో భాగంగా సంప్రదాయమైన దుస్తులు అంటే పోలీస్ యూనిఫాం కాకుండా చీరకట్టులో వచ్చారు ఎస్పీ అంకిత శర్మ. పూజ తర్వాత అక్కడే ఉన్న ఓ AK 47 గన్ తీసుకున్నారు. బుల్లెట్స్ లోడ్ చేశారు. గురి పెట్టారు.. గాల్లోకి ఏకే 47 తుపాకీతో కాల్పులు జరిపారు. జిల్లా ఎస్పీ స్థాయి
చీర కట్టులో.. AK 47తో IPS అంకిత శర్మ కాల్పులు
చీర కట్టులో.. AK 47తో IPS అంకిత శర్మ కాల్పులు

ఆయుధ పూజ.. దసరా రోజు చేసే పూజ ఇది. వారి వారి స్థోమతను బట్టి ఈ ఆయుధ పూజ చేయటం ఆనవాయితీ. ఈ క్రమంలోనే పోలీసులు అయితే తమ దగ్గర ఉంటే తుపాకులకు పూజలు చేస్తుంటారు. ఇది కామన్. ఈసారి ఇలాంటి పూజ సందర్భంగా ఓ వీడియో వైరల్ అయ్యింది. ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందామా..

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం రాజ్ నంగ్ గావ్ జిల్లా. ఆ జిల్లాకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్.. SP గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు అంకిత శర్మ. ఆయుధ పూజలో భాగంగా సంప్రదాయమైన దుస్తులు అంటే పోలీస్ యూనిఫాం కాకుండా చీరకట్టులో వచ్చారు ఎస్పీ అంకిత శర్మ. పూజ తర్వాత అక్కడే ఉన్న ఓ AK 47 గన్ తీసుకున్నారు. బుల్లెట్స్ లోడ్ చేశారు. గురి పెట్టారు.. గాల్లోకి ఏకే 47 తుపాకీతో కాల్పులు జరిపారు. జిల్లా ఎస్పీ స్థాయి అధికారి కాల్పులు జరపటంలో వింత, విశేషం లేదు కానీ.. ఎస్పీ అంకిత శర్మ చీరకట్టులో.. అందులోనూ ఏకే 47 తుపాకీతో కాల్పులు జరిపే వీడియో ఏదైతే ఉందో.. ఆ వీడియో వైరల్ అయ్యింది.

ఎవరీ అంకిత శర్మ :

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతం అయిన రాజ్ నందగావ్ జిల్లాకు ఆమె ఎస్పీగా పని చేస్తున్నారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తారు. ఈ క్రమంలోనే ఆమెను లేడీ సింగం అంటూ స్థానికులు పిలుస్తుంటారు. 2018 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆమె. ఎస్పీ అంకిత శర్మకు వైరల్ కావటం ఇదేమీ కొత్తకాదు. ఆమె చేసే పనుల వల్ల తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు. ఈసారి నిండైన చీరకట్టులో ఏకే 47 తుపాకీతో కాల్పులు జరపటం.. అది ఆయుధ పూజ సమయంలో కావటంతో మరోసారి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. మరో విశేషం కూడా ఉంది. ఆమె సొంత రాష్ట్రం ఛత్తీస్ ఘడ్..

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← ఓపెన్ అయిన 5 నిమిషాల్లో 85% జియో ఐపీఓ షేర్లకు బిడ్డింగ్.. ఇన్వెస్టర్లకు బ్రోకరేజీలు కీలక సూచన?దసరా తర్వాత బ్రేక్ తీసుకున్న గోల్డ్ అండ్ సిల్వర్.. హైదరాబాదులో రేట్లు ఎంతంటే? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com