☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
వేగంగా దూసుకొస్తున్న కారు.. ఆపి చెక్ చేసిన పోలీసుల మైండ్‌బ్లాక్..! • అబీయేలోని మార్కెట్‌పై డ్రోన్ దాడి: 153 మంది మృతి • పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో సీట్లు • Son of Kanaka Durgamma : అమ్మవారి అవతారంలో లయ.. ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ పోస్టర్ అదిరిందిగా! • Ration Card : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రేషన్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త.. • సౌరవ్ దాస్,అశుతోష్ రాంకాలపై నమోదైన రెండో కేసు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ • పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి.. సీఎం రేవంత్ కీలక ప్రకటన • ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు! •

ఓపెన్ అయిన 5 నిమిషాల్లో 85% జియో ఐపీఓ షేర్లకు బిడ్డింగ్.. ఇన్వెస్టర్లకు బ్రోకరేజీలు కీలక సూచన?

ఓపెన్ అయిన 5 నిమిషాల్లో 85% జియో ఐపీఓ షేర్లకు బిడ్డింగ్.. ఇన్వెస్టర్లకు బ్రోకరేజీలు కీలక సూచన?
ఓపెన్ అయిన 5 నిమిషాల్లో 85% జియో ఐపీఓ షేర్లకు బిడ్డింగ్.. ఇన్వెస్టర్లకు బ్రోకరేజీలు కీలక సూచన?
ఓపెన్ అయిన 5 నిమిషాల్లో 85% జియో ఐపీఓ షేర్లకు బిడ్డింగ్.. ఇన్వెస్టర్లకు బ్రోకరేజీలు కీలక సూచన?

స్టాక్ మార్కెట్ చరిత్రలో సరికొత్త సంచలనానికి తెరలేపుతూ ప్రారంభమైన రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి ఊహించని భారీ స్పందన లభించింది. మార్కెట్లో ఐపీఓ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే ఇన్వెస్టర్లు ఎగబడి బిడ్లు దాఖలు చేశారు. దీంతో ఏకంగా 85 శాతం షేర్లకు బిడ్డింగ్స్ జస్ట్ 5 నిమిషాల్లోనే జరగడం జియో క్రేజ్‌కు నిదర్శనం. భారత్‌లోనే అతిపెద్ద ప్రైమరీ ఆఫరింగ్‌గా వస్తున్న ఈ ఐపీఓపై మార్కెట్ వర్గాల్లో విపరీతమైన అంచనాలు కొనసాగుతున్నాయి.

యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి సూపర్ స్పందన:
జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకి యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి అసాధారణ స్పందనను రాబట్టింది. దేశీయ మ్యూచువల్ ఫండ్స్, గ్లోబల్ ఫండ్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి ఏకంగా రూ. 2లక్షల 50వేల కోట్లకు పైగా భారీ డిమాండ్ లభించగా.. కంపెనీ ఏకంగా 212 యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా రూ.8వేల 110 కోట్లను సమీకరించింది. ఈ బలమైన డిమాండ్ ఇప్పుడు రిటైల్, ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లలో భారీ నమ్మకాన్ని పెంచింది.

ఐపీఓ ప్రైస్ బ్యాండ్:
జియో ప్లాట్‌ఫామ్స్ తాజా ఐపీఓ ద్వారా ఇన్వెస్టర్ల నుంచి రూ.30వేల 213 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పూర్తిగా తాజా షేర్ల జారీ రూపంలో ఉంది. ఇందుకోసం కంపెనీ షేర్ల ప్రైస్ బ్యాండ్ ధరను రూ.1,065 - రూ.1,119 మధ్య నిర్ణయించారు. ఇన్వెస్టర్లు కనీసం 12 షేర్లకు బిడ్ వేయాల్సి ఉంటుంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ.10 లక్షల 30వేల కోట్లకు పైగా అంచనా వేయబడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అర్హులైన షేర్‌హోల్డర్లకు, ఉద్యోగులకు ప్రత్యేక కోటాను కేటాయించడమే కాక ఒక్కో షేరుపై రూ.54 డిస్కౌంట్ కూడా ప్రకటించింది.

గ్రే మార్కెట్లో దూసుకుపోతున్న ప్రీమియం:
మార్కెట్లో మిశ్రమ పరిస్థితులు ఉన్నప్పటికీ.. జియో ప్లాట్‌ఫామ్స్ గ్రే మార్కెట్ ప్రీమియం దూసుకుపోతోంది. అనధికార మార్కెట్లో దీని ప్రీమియం రూ. 270 - 280 వరకు పలుకుతోంది. ఇది ఇన్వెస్టర్లకు దాదాపు 23 నుంచి 25 శాతం వరకు తొలిరోజే లాభాలు అందించవచ్చని మార్కెట్ నిపుణులు అంటున్నారు.

ఇన్వెస్టర్లకు టాప్ బ్రోకరేజ్ సంస్థల సలహా:
జియో ప్లాట్‌ఫామ్స్ మార్కెట్ లీడర్‌షిప్, బలమైన డిజిటల్ కనెక్టివిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, 50 కోట్లకు పైగా ఉన్న భారీ సబ్‌స్క్రైబర్ బేస్ కారణంగా టాప్ బ్రోకరేజ్ సంస్థలు సానుకూలంగా స్పందించాయి. మోతీలాల్ ఓస్వాల్, యెస్ సెక్యూరిటీస్, సిస్టమాటిక్స్, SMIFS వంటి ప్రముఖ సంస్థలు దీర్ఘకాలిక పెట్టుబడిదారులు ఈ ఇష్యూను 'సబ్‌స్క్రైబ్' చేసుకోవాలని గట్టిగా సిఫారసు చేశాయి.

ALSO READ : ఫుడ్ డెలివరీలోకి ఫ్లిప్‌కార్ట్.. స్విగ్గీ, జొమాటోకు గట్టి షాకే ఇది..!

కంపెనీ తమ టెలికాం యూజర్ల నుంచి సగటు ఆదాయం వృద్ధి, 5G విస్తరణ, డిజిటల్ సేవల ద్వారా వచ్చే బలమైన క్యాష్ ఫ్లో కంపెనీకి భవిష్యత్తులో అద్భుతమైన వృద్ధి రెట్లుగా మారతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఐపీఓ ద్వారా వచ్చే నిధులను కంపెనీ అప్పుల తగ్గింపునకు ఉపయోగించనుండటం బ్యాలెన్స్ షీట్‌ను మరింత పటిష్టం చేస్తుందని టెలికాం నిపుణులు చెబుతున్నారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← మంచిర్యాలలో హై టెన్షన్.. రోడ్లపై భారీగా మోహరించిన పోలీసులుచీర కట్టులో.. AK 47తో IPS అంకిత శర్మ కాల్పులు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com