☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

Iran: ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు.. కవల సోదరీమణుల్లో ఒకరికి మరణశిక్ష మరొకరికి 27 ఏళ్ల జైలు!

Iran: ఇరాన్‌లోని ఇస్ఫహాన్‌ నగరానికి చెందిన 19 ఏళ్ల కవల సోదరీమణులు తారానెహ్, రోమినా రహీమీల కన్నీటి కథ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరినీ కలచివేస్తోంది. జనవరిలో ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగాయి. ఆ సమయంలో పాఠశాలలో చదువుకుంటున్న ఈ ఇద్దరు అమ్మాయిలు కూడా మొదటిసారి ఆందోళనల్లో పాల్గొన్నారు. అయితే ఆ నిరసనల్లో పాల్గొన్న కొద్ది రోజులకే, ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు వారి ఇంటిపై దాడి చేసి ఆ ఇద్దరినీ బలవంతంగా తీసుకెళ్లిపోయారు. ఈ ఘటన తరువాత షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ముసుగు దొంగలు ఇరాన్‌కు చెందిన "ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కోర్" సభ్యులని తేలింది. తమ కూతుళ్లు ఏమైపోయారో తెలియక వారి తల్లి మర్జయా నూర్మొహమ్మదీ దాదాపు నాలుగు నెలల పాటు ఆసుపత్రులు, ప్రభుత్వ ఆఫీసు
Iran: ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు.. కవల సోదరీమణుల్లో ఒకరికి మరణశిక్ష మరొకరికి 27 ఏళ్ల జైలు!

Iran: ఇరాన్‌లోని ఇస్ఫహాన్‌ నగరానికి చెందిన 19 ఏళ్ల కవల సోదరీమణులు తారానెహ్, రోమినా రహీమీల కన్నీటి కథ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరినీ కలచివేస్తోంది. జనవరిలో ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగాయి. ఆ సమయంలో పాఠశాలలో చదువుకుంటున్న ఈ ఇద్దరు అమ్మాయిలు కూడా మొదటిసారి ఆందోళనల్లో పాల్గొన్నారు. అయితే ఆ నిరసనల్లో పాల్గొన్న కొద్ది రోజులకే, ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు వారి ఇంటిపై దాడి చేసి ఆ ఇద్దరినీ బలవంతంగా తీసుకెళ్లిపోయారు. ఈ ఘటన తరువాత షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ముసుగు దొంగలు ఇరాన్‌కు చెందిన “ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కోర్” సభ్యులని తేలింది. తమ కూతుళ్లు ఏమైపోయారో తెలియక వారి తల్లి మర్జయా నూర్మొహమ్మదీ దాదాపు నాలుగు నెలల పాటు ఆసుపత్రులు, ప్రభుత్వ ఆఫీసులు, జైళ్ల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగారు. చివరికి వారికి ఒక చేదు నిజం ఎదురైంది. ఈ కేసులో తారానెహ్‌కు ఏకంగా మరణశిక్ష విధించగా, రోమినాకు 27 ఏళ్ల జైలు శిక్ష పడింది. దీంతో దిక్కుతోచని ఆ కుటుంబం కోర్టులో అప్పీల్ చేయడమే కాకుండా, ఇప్పుడు ఐక్యరాజ్యసమితి (యుఎన్) ని కూడా సాయం కోరింది.

అసలు ఈ దారుణం జనవరిలో ఇస్ఫహాన్‌లోని షోహదా చౌక్ దగ్గర ప్రారంభమైంది. అక్కడ పెద్ద ఎత్తున ప్రజలు నిరసన తెలుపుతున్న సమయంలో తారానెహ్, రోమినాలు కూడా అందులో చేరారు. నిజానికి అంతకుముందు వారు ఎప్పుడూ ఏ విధమైన నిరసనల్లోనూ పాల్గొనలేదు. సరిగ్గా ఆ సమయంలోనే చౌక్ దగ్గర జరిగిన ఘర్షణల్లో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అందులో ఒకరు రివాల్యూషనరీ గార్డ్ సభ్యుడు కాగా, మరొకరు నిరాశ్రయుడైన వ్యక్తి. ఈ ఘటన తర్వాత ఈ ఇద్దరు సోదరీమణులతో సహా మొత్తం 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిపై మోలోటోవ్ కాక్‌టైల్స్ తయారు చేశారని, భద్రతా దళాలపై దాడులు చేశారని తీవ్రమైన ఆరోపణలు మోపారు. అంతేకాకుండా, ఇరాన్ చట్టాల ప్రకారం మరణశిక్ష పడే “దేవుడికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం” (మొహరేబెహ్) అనే కఠినమైన నేరాన్ని కూడా వీరిపై రుద్దారు.

అయితే ఆ అమ్మాయిలకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని, చివరికి వారి తరఫు న్యాయవాదులకు కేసు ఫైళ్లను సరిగ్గా చూడటానికి కూడా అనుమతి ఇవ్వలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరెస్టు చేసిన తర్వాత ఆ సోదరీమణులను వేర్వేరు చీకటి గదుల్లో ఉంచారు. గదులు వేరైనా, ఒకరి భయంకరమైన అరుపులు మరొకరికి వినిపించేవి. అక్కడ వారిని లాఠీలతో దారుణంగా కొట్టారని, మానసిక నరకం చూపించడమే కాకుండా లైంగికంగా వేధించారని కుటుంబ సభ్యులు, న్యాయవాదులు చెబుతున్నారు. ముఖ్యంగా తారానెహ్‌ మోకాళ్లు, మోచేతులు, చేతులపై లాఠీలతో తీవ్రంగా కొట్టడం వల్ల ఆమె దేహానికి పెద్ద ఎత్తున గాయాలయ్యాయి. మే నెలలో ఎట్టకేలకు తల్లిని తమ కూతుళ్లను కలవడానికి అనుమతించినప్పుడు, ఆ తల్లి తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ముఖాలు వాచిపోయి, తలపై వెంట్రుకలు ఊడిపోయి ఉన్న ఆ అమ్మాయిలను చూసి ఆమె మొదట గుర్తుపట్టలేకపోయింది, కేవలం వారి గొంతు ఆధారంగానే వారు తన పిల్లలని తెలుసుకోగలిగింది. తారానెహ్‌కు పడిన ఉరిశిక్షను ఆపడానికి కుటుంబం ఇప్పుడు బ్రిటన్‌కు చెందిన మానవ హక్కుల న్యాయవాదుల ద్వారా ఐక్యరాజ్యసమితిలో అధికారికంగా ఫిర్యాదు చేసింది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Afg Vs Nepal: ఏంది సామీ ఆ ఆట.. ఆఫ్ఘనిస్థాన్‌ను చుట్టేసిన నేపాల్ జట్టు.. కుమ్మేసిన పసికూన..The Paradise-Nani: ట్రోల్స్‌ను బాగా ఎంజాయ్ చేశా.. మీ ప్రేమకు కృతజ్ఞతలు.. నాని పోస్ట్ వైరల్! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com