☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

The Paradise-Nani: ట్రోల్స్‌ను బాగా ఎంజాయ్ చేశా.. మీ ప్రేమకు కృతజ్ఞతలు.. నాని పోస్ట్ వైరల్!

The Paradise Hero Nani Reacts to Trolls and Love: ‘నేచురల్ స్టార్’ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ మూవీ సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. సినిమాపై ప్రేక్షకులు, అభిమానులు, విమర్శకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ నేపథ్యంలో హీరో నాని స్పందిస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. […]
The Paradise-Nani: ట్రోల్స్‌ను బాగా ఎంజాయ్ చేశా.. మీ ప్రేమకు కృతజ్ఞతలు.. నాని పోస్ట్ వైరల్!

The Paradise Hero Nani Reacts to Trolls and Love: ‘నేచురల్ స్టార్’ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ మూవీ సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. సినిమాపై ప్రేక్షకులు, అభిమానులు, విమర్శకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ నేపథ్యంలో హీరో నాని స్పందిస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. సినిమాపై వచ్చిన ప్రతి స్పందనను తాను గమనించానని నాని పేర్కొన్నారు.

‘మీ అందరి రియాక్షన్స్ చూశాను. మీరు చూపించిన ప్రేమను అందుకున్నాను. అదే సమయంలో మీరు చేసిన ఫన్నీ ట్రోల్స్‌ను కూడా బాగా ఎంజాయ్ చేశాను. ప్రేక్షకులు సినిమాను తమ సొంత సినిమాలా ఆదరించిన తీరు నా హృదయాన్ని తాకింది. అదే సమయంలో విమర్శకులు, రివ్యూవర్లు సినిమాలోని లోపాలను ఎత్తిచూపిన విషయాల నుంచి కూడా మేము నేర్చుకున్నాం. ది ప్యారడైజ్ కోసం మేమంతా ఎంతో కష్టపడ్డాము. మీకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో రక్తం, చెమట చిందించి ఈ సినిమాను రూపొందించాం. ఇప్పుడు ఈ సినిమా మీదే. మీరు దీన్ని సెలబ్రేట్ చేయాలనుకున్నా, జడ్జ్ చేయాలనుకున్నా అది మీ ఇష్టం’ అంటూ నాని పోస్ట్ చేశారు.

సినిమా విడుదలకు ముందు ప్రేక్షకులు చూపించిన ఉత్సాహం, తనపై చూపించిన అభిమానానికి నాని కృతజ్ఞతలు తెలిపారు. ‘సినిమాపై మీరు చూపించిన ఎగ్జైట్‌మెంట్, నాపై చూపించిన ఆప్యాయత నా హృదయాన్ని ఉప్పొంగేలా చేసింది. మీ అందరికీ ధన్యవాదాలు చెప్పడం తప్ప ఇంకేమీ చెప్పలేను’ అంటూ నాని రాసుకొచ్చారు. ప్యారడైజ్ మూవీపై వస్తున్న స్పందనల మధ్య నాని చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రేక్షకుల ప్రేమతో పాటు విమర్శలను కూడా స్వీకరిస్తున్నానని నాని చెప్పుకొచ్చారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Iran: ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు.. కవల సోదరీమణుల్లో ఒకరికి మరణశిక్ష మరొకరికి 27 ఏళ్ల జైలు!Netanyahu: యూఎన్‌లో నెతన్యాహు ప్రసంగిస్తుండగా షాకింగ్ సీన్.. ఇరాన్ ఏం చేసిందంటే..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com