☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కరవు ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు గుడ్‌న్యూస్.. 15 రోజుల్లో జాబ్‌కార్డులు • Viral Video: పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. ఎలా ఏడ్చాడో చూడండి! వీడియో వైరల్ • వాస్తు ప్రకారం.. ఇంట్లో తులసి మొక్కను ఉంచకూడని ప్రదేశాలు • నేడు స్థిరంగా బంగారం ధరలు • అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి • Sarpanch Suicide Attempt | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధింపులు.. కరీంనగర్‌ జిల్లాలో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం! • OTT Cinema : థియేటర్లలో సంచలనం.. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్.. ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా.. • Video: ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా..! •

Netanyahu: యూఎన్‌లో నెతన్యాహు ప్రసంగిస్తుండగా షాకింగ్ సీన్.. ఇరాన్ ఏం చేసిందంటే..!

న్యూయార్క్ వేదికగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆయా దేశాలకు చెందిన ప్రతినిధులు తమ వాదనను వినిపించారు. ఇక ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వంతు రాగానే సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది.
Netanyahu: యూఎన్‌లో నెతన్యాహు ప్రసంగిస్తుండగా షాకింగ్ సీన్.. ఇరాన్ ఏం చేసిందంటే..!

న్యూయార్క్ వేదికగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆయా దేశాలకు చెందిన ప్రతినిధులు తమ వాదనను వినిపించారు. ఇక ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వంతు రాగానే సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. నెతన్యాహు ప్రసంగం ప్రారంభించగానే డజన్ల కొద్దీ ప్రతినిధులంతా జనరల్ అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. ఇక ఇరాన్ వాకౌట్ చేస్తూ ఖాళీ బల్లపై సులేమానీ చిత్రపటాన్ని ఉంచేసి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా సభ నుంచి వెళ్లిపోయిన వారిని ఉద్దేశించి ‘నైతిక పిరికివాళ్లు’ అంటూ నెతన్యాహు సంబోధించారు.

Netanyahu

గురువారం ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఇజ్రాయెల్ ప్రధాని మంత్రి నెతన్యాహు ప్రసంగించారు. ప్రసంగం అలా ప్రారంభించారో లేదో వెంటనే టెహ్రాన్ బృందం తమకు కేటాయించిన బల్లపై ఖాసిమ్ సులేమానీ చిత్రపటాన్ని వదిలేసి వెళ్లిపోయారు. చాలా వేగంగా సభ నుంచి వెళ్లిపోయారు. కొంత మంది హేళన చేస్తూ మాట్లాడారు. అయితే నెతన్యాహు మద్దతుదారులు మాత్రం సభలో నిలబడి చప్పట్లతో కొడుతూ ఉత్సాహపరిచారు. దీంతో మిగిలిన నిరసనకారులంతా వెళ్లిపోవాలని నెతన్యాహు సూచించారు. ఈ సభలో విడిచి వెళ్లని నైతిక పిరికివాళ్లు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే వెళ్లిపోవాలని తెలిపారు.

ఇక నెతన్యాహు తన ప్రసంగంలో ఇజ్రాయెల్ చర్యలను సమర్థించారు. ఇరాన్ నాయకత్వాన్ని హంతక నియంతృత్వంగా అభివర్ణించారు. టెహ్రాన్ అణ్వాయుధాలను తయారు చేయకుండా ఇజ్రాయెల్ అడ్డుకుందని తెలిపారు. చివరికి ఇరాన్ ప్రభుత్వం పతనమైందని పేర్కొన్నారు. ఇక ప్రసంగిస్తుండగా నెతన్యాహు ఒక వస్తువును చూపించి స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ పరికరాన్ని పైకి పట్టుకుని ఇరాన్ ప్రతినిధి బృందానికి అందజేయాలని కోరారు. తన మాటల్లో చెప్పాలంటే.. ఇరాన్ అధికారులు చివరికి సోషల్ మీడియాలో తమ కథను స్వేచ్ఛగా చెప్పగలరని తెలిపారు.

ఇక నెతన్యాహు పనిలో పనిగా టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్, న్యూయార్క్ మేయర్ మమ్దానీ సహా పలువురు అంతర్జాతీయ విమర్శకులపై కూడా విమర్శలు గుప్పించారు. ఇక అక్టోబర్ 27న ఇజ్రాయెల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో యూఎన్‌లో నెతన్యాహు చేసిన ప్రసంగం ప్రాధాన్యత సంతరించుకుంది.

సులేమానీ.. 2020 జనవరిలో బాగ్దాద్ విమానాశ్రయం సమీపంలో అమెరికా డ్రోన్ దాడిలో మరణించాడు. అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో ఈ దాడి జరిగినట్లు నివేదికలు పేర్కొన్నాయి.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← The Paradise-Nani: ట్రోల్స్‌ను బాగా ఎంజాయ్ చేశా.. మీ ప్రేమకు కృతజ్ఞతలు.. నాని పోస్ట్ వైరల్!Imandi Ravi: ఐబొమ్మ పైరసీ కేసులో బిగ్‌ అప్‌డేట్.. ఇమంది రవీకి భారీ ఊరట! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com