☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కరవు ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు గుడ్‌న్యూస్.. 15 రోజుల్లో జాబ్‌కార్డులు • Viral Video: పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. ఎలా ఏడ్చాడో చూడండి! వీడియో వైరల్ • వాస్తు ప్రకారం.. ఇంట్లో తులసి మొక్కను ఉంచకూడని ప్రదేశాలు • నేడు స్థిరంగా బంగారం ధరలు • అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి • Sarpanch Suicide Attempt | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధింపులు.. కరీంనగర్‌ జిల్లాలో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం! • OTT Cinema : థియేటర్లలో సంచలనం.. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్.. ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా.. • Video: ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా..! •

కరవు ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు గుడ్‌న్యూస్.. 15 రోజుల్లో జాబ్‌కార్డులు

Rural Employment: వర్షాభావ పరిస్థితులతో వ్యవసాయ పనులు తగ్గి గ్రామీణ కూలీలకు ఉపాధి, ఆదాయం తగ్గుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో...
కరవు ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు గుడ్‌న్యూస్.. 15 రోజుల్లో జాబ్‌కార్డులు

Rural Employment: వర్షాభావ పరిస్థితులతో వ్యవసాయ పనులు తగ్గి గ్రామీణ కూలీలకు ఉపాధి, ఆదాయం తగ్గుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కోరుకునే కొత్త కుటుంబాలను వీబీ-జీ రామ్ జీ (VB-G RAM G) పథకంలోకి చేర్చి వారికి త్వరగా జాబ్‌కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి 15 రోజుల్లోనే జాబ్‌కార్డు అందేలా ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం.

Read Also :AP Pensions new rule: నవంబర్ 1 నుంచి ఏపీ పెన్షన్స్ మార్పు

18 జిల్లాల్లో 265 మండలాల్లో కరవు పరిస్థితులు

Rural Employment

వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో పలు ప్రాంతాల్లో పంటల సాగు తగ్గింది. దీంతో వ్యవసాయ పనులపై ఆధారపడే కూలీలకు పనిదినాలు తగ్గి ఆదాయ నష్టం ఎదురయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే 18 జిల్లాల్లోని 265 మండలాలను కరవు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రాంతాల్లో గ్రామీణ కుటుంబాలకు ప్రత్యామ్నాయంగా ఉపాధి హామీ పనులు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

ప్రతి గ్రామంలో 100 నుంచి 150 మందికి ఉపాధి

గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఇప్పటికే జాబ్‌కార్డులు ఉన్నవారితో పాటు కొత్తగా ఉపాధి కోరుకునే వారిని కూడా నమోదు చేయాలని సూచించింది. ప్రతి గ్రామంలో రోజుకు 100 నుంచి 150 మందికి ఉపాధి కల్పించేలా పనులను గుర్తించి అమలు చేయాలని అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ముఖ్యంగా కరవు ప్రభావిత మండలాల్లో ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

ప్రస్తుతం 52.46 లక్షల కుటుంబాలకు జాబ్‌కార్డులు

రాష్ట్రంలో ప్రస్తుతం 52.46 లక్షల కుటుంబాలకు చెందిన 1.08 కోట్ల మంది జాబ్‌కార్డులు కలిగి ఉన్నట్లు సమాచారం. వీరికి కొనసాగుతున్న ఉపాధి అవకాశాలతో పాటు కొత్తగా పని కోరుకునే కుటుంబాలను కూడా పథకంలోకి తీసుకురావడం ద్వారా కరవు పరిస్థితుల్లో ఆదాయ నష్టాన్ని తగ్గించాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా ఉంది. VB-G RAM G పథకం దేశవ్యాప్తంగా 2026 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ పథకం కింద గ్రామీణ కుటుంబాలకు ఒక ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల వరకు వేతన ఉపాధి హామీ కల్పించే నిబంధన ఉంది.

Rural Employment: జాబ్‌కార్డు కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

18 ఏళ్లు నిండిన గ్రామీణులు జాబ్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్ణీత దరఖాస్తు ఫారంతో పాటు ఆధార్, ఫొటో వంటి అవసరమైన పత్రాలను సమర్పించాలి. దరఖాస్తును గ్రామ పంచాయతీ కార్యదర్శికి అందించాలి. దరఖాస్తును పరిశీలించిన అనంతరం సంబంధిత మండల కార్యాలయానికి పంపిస్తారు. అక్కడ అధికారులు అర్హతను పరిశీలించి జాబ్‌కార్డు జారీ చేసే ప్రక్రియను పూర్తి చేస్తారు. కొత్త దరఖాస్తుదారులకు ఈ ప్రక్రియను వేగవంతం చేసి 15 రోజుల్లోనే కార్డు అందించేలా చర్యలు తీసుకోనున్నారు. వ్యవసాయ పనులు తగ్గిన సమయంలో గ్రామీణ కుటుంబాలకు స్థానికంగానే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించడం ద్వారా ఆదాయానికి కొంత భరోసా కల్పించడంతో పాటు వలసలను తగ్గించేందుకు ఈ చర్యలు ఉపయోగపడే అవకాశం ఉంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Divi : తిరుచానూరు పద్మావతి టెంపుల్ లో నటి దివి..నేడు స్థిరంగా బంగారం ధరలు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com