☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కరవు ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు గుడ్‌న్యూస్.. 15 రోజుల్లో జాబ్‌కార్డులు • Viral Video: పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. ఎలా ఏడ్చాడో చూడండి! వీడియో వైరల్ • వాస్తు ప్రకారం.. ఇంట్లో తులసి మొక్కను ఉంచకూడని ప్రదేశాలు • నేడు స్థిరంగా బంగారం ధరలు • అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి • Sarpanch Suicide Attempt | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధింపులు.. కరీంనగర్‌ జిల్లాలో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం! • OTT Cinema : థియేటర్లలో సంచలనం.. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్.. ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా.. • Video: ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా..! •

Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!

Kadapa Woman Murdered: కడప నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎన్టీపీసీ పవర్‌ గ్రిడ్‌ ఎదురుగా ఓ మహిళ హత్యకు గురైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. అనుమానంతో ఓ వ్యక్తి తన ప్రియురాలిని గొంతు కోసి హత్య చేసిన అనంతరం.. తాను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప నియోజకవర్గ పరిధిలోని సీకే దిన్నె మండలం ఎన్టీపీసీ సమీపంలో […]
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!

Kadapa Woman Murdered: కడప నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎన్టీపీసీ పవర్‌ గ్రిడ్‌ ఎదురుగా ఓ మహిళ హత్యకు గురైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. అనుమానంతో ఓ వ్యక్తి తన ప్రియురాలిని గొంతు కోసి హత్య చేసిన అనంతరం.. తాను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప నియోజకవర్గ పరిధిలోని సీకే దిన్నె మండలం ఎన్టీపీసీ సమీపంలో హత్యకు గురైన మహిళను షేక్‌ శంషాద్‌ బేగం (42)గా గుర్తించారు. ఆమెను శీను (31) అనే వ్యక్తి గొంతు కోసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మహిళపై దాడి చేసిన అనంతరం శీను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిచాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు, పోలీసులు వెంటనే కడప రిమ్స్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అసలు హత్యకు దారితీసిన కారణాలేంటి?.. వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటి?.. అనుమానానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది. ప్రస్తుతం కడపలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్‌ ఎక్కువ? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com