☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కరవు ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు గుడ్‌న్యూస్.. 15 రోజుల్లో జాబ్‌కార్డులు • Viral Video: పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. ఎలా ఏడ్చాడో చూడండి! వీడియో వైరల్ • వాస్తు ప్రకారం.. ఇంట్లో తులసి మొక్కను ఉంచకూడని ప్రదేశాలు • నేడు స్థిరంగా బంగారం ధరలు • అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి • Sarpanch Suicide Attempt | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధింపులు.. కరీంనగర్‌ జిల్లాలో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం! • OTT Cinema : థియేటర్లలో సంచలనం.. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్.. ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా.. • Video: ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా..! •

Sarpanch Suicide Attempt | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధింపులు.. కరీంనగర్‌ జిల్లాలో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం!

Sarpanch Suicide Attempt | కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం కొండయ్యపల్లి సర్పంచ్‌ మల్యాల తిరుపతి ఆత్మహత్యకు యత్నించాడు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అక్రమ కేసులు పెడతానని వేధిస్తుండటంతో మనస్తాపం చెందిన పురుగుల మందు తాగాడు.
Sarpanch Suicide Attempt | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధింపులు.. కరీంనగర్‌ జిల్లాలో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం!

Sarpanch Suicide Attempt | కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం కొండయ్యపల్లి సర్పంచ్‌ మల్యాల తిరుపతి అలియాస్‌ వినయ్‌ సాగర్‌ ఆత్మహత్యకు యత్నినంచారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, గంగాధర మండలంలోని కాంగ్రెస్‌ పార్టీ సర్పంచులు తనను అవమానాలకు గురిచేస్తున్నారని, తనపై అక్రమ కేసులు పెట్టించి వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆదివారం మధురానగర్‌ చౌరస్తాలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద క్రిమిసంహార మందు తాగాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే అడ్డుకుని ఆయనను ప్రైవేటు వాహనంలో కరీంనగర్‌ సివిల్‌ ఆస్పత్రికి తరలించారు.

ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తనపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. గంజాయి కేసు పెడతానంటూ బెదిరిస్తున్నారని, గంగాధర పోలీసులు ఫోన్‌ చేసి కేసు నమోదైందని, నోటీసులు తీసుకోవాలని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గంగాధర మండల సర్పంచుల వాట్సాప్‌ గ్రూపులో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సర్పంచులు తనను అవమానకరంగా మాట్లాడుతున్నారని తిరుపతి ఆరోపించారు. తన ఆత్మహత్యాయత్నానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, గంగాధర మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ముద్దం నగేష్‌ బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు.`

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ పరామర్శ..మచ్చర్ సాహసానికి షేక్ హమ్దాన్ బిన్ అభినందనలుViral News | ఖ‌రీదైన ప‌ట్టుచీర‌లు చోరీ.. మీడియాలో వార్త‌లు.. భ‌య‌ప‌డి వెన‌క్కి పంపిన దొంగ‌లు..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com