☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కరవు ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు గుడ్‌న్యూస్.. 15 రోజుల్లో జాబ్‌కార్డులు • Viral Video: పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. ఎలా ఏడ్చాడో చూడండి! వీడియో వైరల్ • వాస్తు ప్రకారం.. ఇంట్లో తులసి మొక్కను ఉంచకూడని ప్రదేశాలు • నేడు స్థిరంగా బంగారం ధరలు • అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి • Sarpanch Suicide Attempt | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధింపులు.. కరీంనగర్‌ జిల్లాలో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం! • OTT Cinema : థియేటర్లలో సంచలనం.. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్.. ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా.. • Video: ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా..! •

Viral News | ఖ‌రీదైన ప‌ట్టుచీర‌లు చోరీ.. మీడియాలో వార్త‌లు.. భ‌య‌ప‌డి వెన‌క్కి పంపిన దొంగ‌లు..!

Viral News | తమిళనాడు (Tamil Nadu) లో ఓ వింత చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ పట్టుచీరల దుకాణం (Silk Sarees shop) లో దొంగ‌లు ఖ‌రీదైన చీర‌లు అప‌హ‌రించారు. ఈ చోరీకి సంబంధించి మీడియాలో పెద్ద ఎత్తున వార్త‌లు వ‌చ్చాయి. దాంతో భ‌య‌ప‌డిపోయిన దొంగ‌లు చోరీ చేసిన చీర‌లు అన్నింటిని కొరియ‌ర్‌ (Corier) లో దుకాణం య‌జ‌మానికి తిరిగి పంపారు.
Viral News | ఖ‌రీదైన ప‌ట్టుచీర‌లు చోరీ.. మీడియాలో వార్త‌లు.. భ‌య‌ప‌డి వెన‌క్కి పంపిన దొంగ‌లు..!

Viral News : తమిళనాడు (Tamil Nadu) లో ఓ వింత చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ పట్టుచీరల దుకాణం (Silk Sarees shop) లో దొంగ‌లు ఖ‌రీదైన చీర‌లు అప‌హ‌రించారు. ఈ చోరీకి సంబంధించి మీడియాలో పెద్ద ఎత్తున వార్త‌లు వ‌చ్చాయి. దాంతో భ‌య‌ప‌డిపోయిన దొంగ‌లు చోరీ చేసిన చీర‌లు అన్నింటిని కొరియ‌ర్‌ (Corier) లో దుకాణం య‌జ‌మానికి తిరిగి పంపారు. ఈ విష‌యాన్ని దుకాణం య‌జ‌మానికి పోలీసులకు తెలియ‌జేయ‌డంతో.. పార్సిల్ పంపిన అడ్ర‌స్ ఆధారంగా దొంగ‌ల‌ను గుర్తించే ప‌నిలోప‌డ్డారు. ఈ అనూహ్య ఘటన తిరువణ్ణామలై (Thiruvannamalai) జిల్లాలోని ఆరణి సమీపంలో ఉన్న సెవూరు గ్రామం (Sevuru Village) లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. సెవూరులోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయ వీధిలో కుమార్ అనే వ్యాపారి పట్టుచీరల దుకాణం నడుపుతున్నాడు. కొన్ని రోజుల క్రితం తెలంగాణ రిజిస్ట్రేషన్ నంబర్‌ ఉన్న ఓ లగ్జరీ కారులో నలుగురు మహిళలతో సహా ఆరుగురు వ్యక్తులు ఆయన దుకాణానికి వెళ్లారు. అక్క‌డ‌ ఖరీదైన చీరలను పరిశీలించిన దొంగ‌లు.. కొన్ని తక్కువ ధరవి కొనుగోలు చేసి వెళ్లిపోయారు. రెండు రోజుల తర్వాత షాపులో ఖరీదైన చీరలు కనిపించకపోవడంతో కుమార్ అనుమానంతో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు.

కస్టమర్లలా వచ్చి ఖ‌రీదైన చీల‌ను ప‌రిశీలించి, త‌క్కువ ధ‌ర చీర‌ల‌ను కొనుక్కుని వెళ్లిన దొంగ‌లే ఆ క‌నిపించ‌కుండా పోయిన చీర‌ల‌ను దొంగిలించిన‌ట్లు సీసీ ఫుటేజీ ద్వారా స్పష్టమైంది. వెంటనే కుమార్ ఆరణి తాలుకా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ చోరీ ఘటనపై స్థానిక వార్తాపత్రికలు, టీవీ ఛానళ్లలో కథనాలు ప్రసారమయ్యాయి. ఇది జరిగిన కొద్ది రోజులకే చోరీకి గురైన 32 పట్టుచీరలు ఓ కొరియర్ పార్శిల్‌లో కుమార్ చిరునామాకు వచ్చాయి.

ఆశ్చర్యపోయిన ఆయన పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం పోలీసులు ఆ పార్శిల్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆరా తీస్తూ నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Sarpanch Suicide Attempt | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధింపులు.. కరీంనగర్‌ జిల్లాలో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం!Free Bus | మహిళల తర్వాత వృద్ధులకూ ఫ్రీ బస్సు.. తెలంగాణలో త్వరలో కొత్త పథకం? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com