☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కరవు ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు గుడ్‌న్యూస్.. 15 రోజుల్లో జాబ్‌కార్డులు • Viral Video: పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. ఎలా ఏడ్చాడో చూడండి! వీడియో వైరల్ • వాస్తు ప్రకారం.. ఇంట్లో తులసి మొక్కను ఉంచకూడని ప్రదేశాలు • నేడు స్థిరంగా బంగారం ధరలు • అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి • Sarpanch Suicide Attempt | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధింపులు.. కరీంనగర్‌ జిల్లాలో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం! • OTT Cinema : థియేటర్లలో సంచలనం.. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్.. ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా.. • Video: ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా..! •

US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!

US-Iran: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల కోసం అమెరికాకు వెళ్లిన ఇద్దరు ఇరాన్ దౌత్యవేత్తల్ని ఆ దేశం బహిష్కరించింది. సర్వసభ్య సమావేశాలు ముగిసిన తర్వాత అమెరికా విడిచి వెళ్లిపోవాలని అమెరికా విదేశాంగ శాఖ వారిని ఆదేశించింది. ఈ ఆదేశాలను ధిక్కరించిన కారణంగా ఇద్దరు దౌత్యవేత్తల్న ట్రంప్ సర్కార్ బహిష్కరించింది. ఒక దౌత్యవేత్త శుక్రవారం అమెరికా విడి వెళ్లగా, మరొకరు శనివారం యూఎస్ నుంచి బయటకు వెళ్లినట్లు అమెరికా అధికారి తెలిపారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ […]
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!

US-Iran: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల కోసం అమెరికాకు వెళ్లిన ఇద్దరు ఇరాన్ దౌత్యవేత్తల్ని ఆ దేశం బహిష్కరించింది. సర్వసభ్య సమావేశాలు ముగిసిన తర్వాత అమెరికా విడిచి వెళ్లిపోవాలని అమెరికా విదేశాంగ శాఖ వారిని ఆదేశించింది. ఈ ఆదేశాలను ధిక్కరించిన కారణంగా ఇద్దరు దౌత్యవేత్తల్న ట్రంప్ సర్కార్ బహిష్కరించింది. ఒక దౌత్యవేత్త శుక్రవారం అమెరికా విడి వెళ్లగా, మరొకరు శనివారం యూఎస్ నుంచి బయటకు వెళ్లినట్లు అమెరికా అధికారి తెలిపారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలని సదరు అధికారి వెల్లడించారు.

అమెరికా, ఇరాన్ మధ్య దౌత్యపరమైన చర్చలు నిలిచిపోయిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. UNGA సమావేశాల సందర్భంగా ఇరు దేశాల మధ్య పరోక్ష చర్చలు జరిగినప్పటికీ పురోగతి కనిపించలేదు. ఆ తర్వాతే ఇరాన్ ప్రతినిధి బృందాన్ని అమెరికా విడిచి వెళ్లాలని రూబియో ఆదేశించినట్లు అమెరికా వర్గాలు వెల్లడించాయి.

ఇదిలా ఉంటే, అమెరికా చర్యల్ని ఇరాన్ ఖండించింది. తమ దౌత్యవేత్తలు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే న్యూయార్క్ నుంచి బయలుదేరినట్లు చెప్పింది. ఆ షెడ్యూల్‌ను సెప్టెంబర్ 17నే అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్‌కు తెలియజేశామని తెలిపింది. అమెరికా చెబుతున్న బహిష్కరణ కథనాలను ఇరాన్ ఖండించింది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com