☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Iran vs US | ఏడు రోజుల ఫార్ములా.. అమెరికా ముందు ఇరాన్ కీల‌క ప్ర‌తిపాద‌న‌..!

Iran vs US | అగ్ర‌రాజ్యం అమెరికా (USA) తో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలను చల్లార్చ‌డం కోసం ఇరాన్ (Iran) ఓ కీలక ప్రతిపాదన తీసుకొచ్చింది. హర్మూజ్ జలసంధి (Strait of Hormuz ) ని తిరిగి తెరిచి, కేవలం ఏడు రోజుల్లోనే విస్తృత చర్చలను పునఃప్రారంభించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది.
Iran vs US | ఏడు రోజుల ఫార్ములా.. అమెరికా ముందు ఇరాన్ కీల‌క ప్ర‌తిపాద‌న‌..!

Iran vs US : అగ్ర‌రాజ్యం అమెరికా (USA) తో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలను చల్లార్చ‌డం కోసం ఇరాన్ (Iran) ఓ కీలక ప్రతిపాదన తీసుకొచ్చింది. హర్మూజ్ జలసంధి (Strait of Hormuz ) ని తిరిగి తెరిచి, కేవలం ఏడు రోజుల్లోనే విస్తృత చర్చలను పునఃప్రారంభించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. ఈ మేర‌కు కీల‌క‌ ప్రతిపాదనను మధ్యవర్తుల ద్వారా ఈ వారంలోనే అమెరికా అధికారులకు పంపినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి (Iran Foreign Minister) అబ్బాస్ అరాఘ్చీ (Abbas Araghchi) వెల్లడించారు. అయితే ఈ ప్రతిపాదనపై అమెరికా ఇంకా స్పందించలేదు.

కాగా ప్రపంచంలోని చమురు సరఫరాలో దాదాపు 20 నుంచి 25 శాతం హర్మూజ్ జలసంధి గుండానే జరుగుతున్న‌ది. ఫిబ్రవరిలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత టెహ్రాన్ ఈ మార్గంలో మైన్‌లు పెట్టి నౌకల రాకపోకలను దాదాపుగా నిలిపివేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రతిపాదనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇటీవల ఐరాస సమావేశంలో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్ చర్చలకు రాకపోతే ‘విధ్వంసం’ తప్పదని తీవ్రంగా హెచ్చరించారు.

దీనికి బదులిచ్చిన ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, బయటి శక్తుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి తగినంత శక్తి అవసరమని.. అయితే చర్చలకు, దౌత్యానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. కాగా, ఇరాన్ అణు కార్యక్రమమే ఈ వివాదానికి మూలకారణం. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా చూడాలని అమెరికా పట్టుబడుతుండగా.. శాంతియుత అణు సాంకేతికతను అభివృద్ధి చేసే హక్కు తమకు ఉందని ఇరాన్ వాదిస్తున్న‌ది. తాజా ప్రతిపాదనలోని ఏడురోజుల ప్రక్రియలో అణు అంశంపై చర్చిస్తారో..? లేదో..? అరాఘ్చీ వెల్లడించలేదు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Netanyahu: యూఎన్ ప్ర‌సంగంలో ప‌శ్చిమాసియా దాడుల‌ను స‌మ‌ర్ధించుకున్న నెత‌న్య‌హూThe Paradise | ది ప్యారడైజ్ నుంచి 7 నిమిషాల సీన్లు కట్.. అసలు విషయం బయటపెట్టిన నటుడు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com