☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

జ్ఞానేశ్ కుమార్ విషయంలో అదే తప్పు జరుగుతోందా..?

రాజకీయ రణరంగంలో కొన్నిసార్లు తీసుకునే మొండి నిర్ణయాలు ప్రభుత్వాల ప్రతిష్టను ఎలా దెబ్బతీస్తాయో గత అనుభవాలు చెబుతున్నా, కేంద్ర ప్రభుత్వం మాత్రం పాత తప్పుల నుంచే ఏమాత్రం నేర్చుకున్నట్లు కనిపించడం లేదు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ సరికొత్త ఉద్యమానికి సైరన్ మోగించింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని, లేనిపక్షంలో ఈ నెల 10వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద […] The post జ్ఞానేశ్ కుమార్ విషయంలో అదే తప్పు జరుగుతోందా..? appeared first on Telugu Rajyam.
జ్ఞానేశ్ కుమార్ విషయంలో అదే తప్పు జరుగుతోందా..?

రాజకీయ రణరంగంలో కొన్నిసార్లు తీసుకునే మొండి నిర్ణయాలు ప్రభుత్వాల ప్రతిష్టను ఎలా దెబ్బతీస్తాయో గత అనుభవాలు చెబుతున్నా, కేంద్ర ప్రభుత్వం మాత్రం పాత తప్పుల నుంచే ఏమాత్రం నేర్చుకున్నట్లు కనిపించడం లేదు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ సరికొత్త ఉద్యమానికి సైరన్ మోగించింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని, లేనిపక్షంలో ఈ నెల 10వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళన చేపడతామని సీజేపీ హెచ్చరించింది.

జ్ఞానేష్ కుమార్ తప్పుకోకపోతే దేశ రాజధానిలో ‘జంతర్ మంతర్ 2.0’ ఉద్యమం మొదలవుతుందని సీజేపీ అగ్రనేత అభిజిత్ దీప్కే సంచలన ప్రకటన చేశారు. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు.. గతంలో జరిగిన నీట్ పేపర్ లీకేజీ ఉదంతాన్ని గుర్తుచేస్తున్నారు. ఆ సమయంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, విపక్షాలు రోడ్డెక్కి అల్లరి చేసినా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించకుండా కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా అడ్డుపడింది.

వ్యవహారం మొత్తం రచ్చ రచ్చ అయ్యి, దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో విమర్శలు మూటగట్టుకున్న తర్వాతే కేంద్రం దిగిరావాల్సి వచ్చింది. ఇప్పుడు సీఈసీ జ్ఞానేష్ కుమార్ విషయంలోనూ కేంద్రం అదే తరహాలో పంతానికి పోయి, వ్యవహారాన్ని మరింత లాగి అనవసరంగా అల్లరి చేసుకునే అవకాశాలే స్పష్టంగా కనపడుతున్నాయి. తమ ఆందోళన పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా జరుగుతుందని సీజేపీ ప్రకటించినప్పటికీ.. ఒకవేళ పోలీసులు లేదా భద్రతా బలగాలు నిరసనకారులను అడ్డుకోవాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.

“ఢిల్లీ సరిహద్దుల్లో లేదా నగరంలో నిరసనకారులను ఎక్కడ ఆపితే.. ఆ ప్రాంతమే మాకు జంతర్ మంతర్‌గా మారుతుంది” అంటూ అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. ఒకవైపు ఎన్నికల సంస్కరణలు, ఓటర్ల జాబితా ప్రక్రియల చుట్టూ వివాదం ముదురుతున్న తరుణంలో.. కేంద్రం ముందస్తుగా స్పందించి డ్యామేజ్ కంట్రోల్ చేయకపోతే, అక్టోబర్ 10న ఢిల్లీ వేదికగా మరో పెద్ద పొలిటికల్ హైడ్రామా జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

The post జ్ఞానేశ్ కుమార్ విషయంలో అదే తప్పు జరుగుతోందా..? appeared first on Telugu Rajyam.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← దేశంలో మరో ఉప్పు సత్యాగ్రహమేనా..?లిక్కర్ స్కామ్ ఇప్పట్లో తేలదా..? పాపం టీడీపీ సోషల్ మీడియా..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com