☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై సమన్లు.. కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి! • Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్‌ సంచలన వ్యాఖ్యలు! • ట్రెజర్ హంటర్‌గా నాగ చైతన్య.. ‘వృషకర్మ’ కొత్త పోస్టర్ విడుదల! • మీ నంబర్ Truecallerలో కనిపిస్తోందా? ఈ ట్రిక్స్‌ ద్వారా డైరెక్టరీ నుండి తొలగించండి..! • Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..! • భారత్‌తో క్రికెట్ ఆడినా మాకు పైసా రావడం లేదు.. వెస్టిండీస్ బోర్డు ఆవేదన • Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’ మూవీలో బాలయ్య రిజెక్ట్ చేసిన రోల్ ఎవరు చేశారో తెలుసా? • YS Jagan : ఎంపీ మిథున్ రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా! చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు.. •

టీడీపీకి రాజధాని జిల్లాల్లో ఏమీ మిగల్చరా..?

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి ఊపందుకుంటున్న తరుణంలో రాజధాని జిల్లాలైన కృష్ణా, గుంటూరు రాజకీయాలు కూటమిలో పెను తుఫానును రేపుతున్నాయి. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సీటును జనసేన ఆశిస్తోందనే వార్తలతో ఇప్పటికే బెజవాడ తమ్ముళ్లు రగిలిపోతుండగా, ఇప్పుడు గుంటూరు జిల్లా జనసేన కూడా అదే బాట పట్టడం తెలుగుదేశం శ్రేణులకు మింగుడుపడటం లేదు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏకంగా 35 శాతం సీట్లతో పాటు తెనాలి, పొన్నూరు మున్సిపాలిటీల్లో గట్టి పట్టున్న స్థానాలను తమకే […] The post టీడీపీకి రాజధాని జిల్లాల్లో ఏమీ మిగల్చరా..? appeared first on Telugu Rajyam.
టీడీపీకి రాజధాని జిల్లాల్లో ఏమీ మిగల్చరా..?

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి ఊపందుకుంటున్న తరుణంలో రాజధాని జిల్లాలైన కృష్ణా, గుంటూరు రాజకీయాలు కూటమిలో పెను తుఫానును రేపుతున్నాయి. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సీటును జనసేన ఆశిస్తోందనే వార్తలతో ఇప్పటికే బెజవాడ తమ్ముళ్లు రగిలిపోతుండగా, ఇప్పుడు గుంటూరు జిల్లా జనసేన కూడా అదే బాట పట్టడం తెలుగుదేశం శ్రేణులకు మింగుడుపడటం లేదు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏకంగా 35 శాతం సీట్లతో పాటు తెనాలి, పొన్నూరు మున్సిపాలిటీల్లో గట్టి పట్టున్న స్థానాలను తమకే కేటాయించాలని జనసేన జిల్లా పార్లమెంట్ సమన్వయకర్త కిలారి రోశయ్య బహిరంగంగా డిమాండ్ చేయడం టీడీపీ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

విజయవాడను ఎలాగూ జనసేన ఖాతాలోకి నెట్టేసేలా ఉన్నారని, ఇప్పుడు గుంటూరును కూడా ఆ రకంగానే లాక్కుంటారా అంటూ గుంటూరు జిల్లా టీడీపీ కార్యకర్తలు అధిష్ఠానం తీరుపై మండిపడుతున్నారు. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తూ, గత వైసీపీ ప్రభుత్వ వేధింపులను తట్టుకుని నిలబడిన బలమైన క్యాడర్ తెలుగుదేశానికి ఉంది. ఇలాంటి కీలకమైన స్థానాల్లో జనసేన ఇంత పెద్ద మొత్తంలో సీట్లు డిమాండ్ చేయడం, తెనాలి, పొన్నూరు లాంటి మున్సిపాలిటీలపై కన్నేయడం చూస్తుంటే భవిష్యత్తులో రాజధాని రీజియన్‌లో టీడీపీ ఉనికిని దెబ్బతీసే వ్యూహం ఉందేమోననే అనుమానాలను తమ్ముళ్లు వ్యక్తం చేస్తున్నారు.

కూటమి ధర్మం పేరుతో చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాల్లో జనసేనకు పెద్దపీట వేస్తున్న తరుణంలో, క్షేత్రస్థాయిలో మాత్రం సీట్ల సర్దుబాటు పంచాయితీ చిలికి చిలికి గాలివానగా మారుతోంది. వైఎస్ జగన్ను ఢీకొట్టడానికి పవన్ కళ్యాణ్ మద్దతు ఎంత అవసరమైనప్పటికీ, దశాబ్దాలుగా ఉన్న పార్టీ కోటలను ఇలా త్యాగం చేసుకుంటూ పోతే ఎలా..? అని సీనియర్ల అనుచరులు ప్రశ్నిస్తున్నారు. బెజవాడ సీట్ల రచ్చ ముగియక ముందే గుంటూరులో జనసేన మార్క్ స్కెచ్ తెరపైకి రావడం కూటమిలో అంతర్గత సమన్వయ లోపాన్ని ఎత్తిచూపుతోందని, ఈ డిమాండ్ల పర్వం రాబోయే రోజుల్లో ఎలాంటి ముగింపునకు దారితీస్తుందోనని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

The post టీడీపీకి రాజధాని జిల్లాల్లో ఏమీ మిగల్చరా..? appeared first on Telugu Rajyam.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← పుంగనూరులో ఏం జరుగుతోంది..? పోలీసుల గాల్లోకి కాల్పులు..!జనసేనపై గెలిచిన పెమ్మసాని..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com