☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

AP News | తిరుమలలో పునఃప్రారంభమైన ఉచిత సర్వదర్శన టోకెన్ల జారీ

AP News | తిరుమలలో ఉచిత సర్వదర్శనం, దివ్య దర్శనం ఉచిత టోకెన్ల జారీని పునఃప్రారంభించారు. ఈ విషయాన్ని గమనించి తమ దర్శన ప్రణాళికను వేసుకోవాలని భక్తులను టీటీడీ కోరింది.
AP News | తిరుమలలో పునఃప్రారంభమైన ఉచిత సర్వదర్శన టోకెన్ల జారీ

AP News | తిరుపతి: తిరుమల (Tirumala) శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 14 నుంచి 23 వరకు కనుల పండువుగా నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు సర్వదర్శన ఉచిత టోకెన్ల జారీని నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ ఉచిత టోకెన్ల జారీని తిరిగి నేడు సెప్టెంబర్‌ 24 నుంచి ప్రారంభించినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌, శ్రీనివాసం, విష్ణు నివాసం కేంద్రాల్లో వీటిని జారీ చేస్తారు.

సర్వదర్శనం (Sarvadasrhanam) కోసం క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండే సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించే ఉద్దేశంతో ఈ ఉచిత టోకెన్లను జారీ చేస్తారని సంగతి తెలిసిందే. బ్రహ్మోత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో టోకెన్ల జారీ కేంద్రాల వద్ద ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ టోకెన్లను నిలిపివేసిన విషయం విదితమే. ఈ టోకెన్ల జారీ కార్యక్రమం నేటి నుంచి తిరిగి ప్రారంభించారు. ఈ విషయాన్ని గమనించి శ్రీవారి దర్శన యాత్రను ప్లాన్‌ చేసుకోవాలని టీటీడీ అధికారులు భక్తులకు సూచించారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← శ్రీశైలం-హైదరాబాద్ హైవేపై విరిగిపడ్డ కొండ చరియలు... పెద్ద ప్రమాదమే తప్పింది..!Mahesh Babu : వార‌ణాసికి మ‌హేశ్ ప్యాక‌ప్‌ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com