☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Bigg Boss Today Promo : డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి ‘దక్షి’..? వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చిన నాగార్జున.. ప్రోమో వైరల్.. • General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక.. • జియో ఐపీఓతో భారీ సంచలనం.. రూ.30,213 కోట్ల సమీకరణ లక్ష్యం! 5G, AIతో భవిష్యత్తు వృద్ధికి భారీ ప్లాన్‌ • Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్! • ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! • Shubman Gill : అయ్యో.. రంజీ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్‌కు బిగ్‌షాక్‌.. ఒక్క పరుగే! సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికర చర్చ • కోటి రూపాయల కరెన్సీ నోట్లతో దుర్గమ్మకు అలంకరణ.. రావులపాలెంలో అమ్మవారిని చూసేందుకు పోటెత్తిన భక్తులు! • Ram Gopal Varma : ఆ బుక్ నన్ను బాగా మోటివేట్ చేసింది.. ఆర్జీవీ చెప్పిన ఈ పుస్తకం గురించి తెలుసా..? •

Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని

Milan protest : యూరప్ దేశమైన ఇటలీలో భారీ నిరసనలు జరుగుతున్నాయి. దేశ రాజధాని మిలన్‌తోపాటు బొలోగ్నా నగరంలో ఆందోళనకారులు భారీ ఎత్తున ఉద్యమించారు. దీంతో నగరం అనేక చోట్ల తగలబడింది.
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని

Milan protest : యూరప్ దేశమైన ఇటలీలో భారీ నిరసనలు జరుగుతున్నాయి. దేశ రాజధాని మిలన్‌తోపాటు బొలోగ్నా నగరంలో ఆందోళనకారులు భారీ ఎత్తున ఉద్యమించారు. దీంతో నగరం అనేక చోట్ల తగలబడింది. అటు పోలీసులకు, ఇటు ఆందోళనకారులకు మధ్య ఘర్షణ తలెత్తింది. దేశంలో పెరుగుతున్న జీవన వ్యయం, ధరల పెరుగుదల, తక్కువ వేతనాలు, వైద్య సదుపాయాల్లో లోపాలు, ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు లేమి వంటి అంశాలకు నిరసనగా ఇటలీలో యువత, విద్యార్థులతోపాటు ఉద్యోగులు, సాధారణ పౌరులు కూడా భారీ ఎత్తున శనివారం ఉద్యమం చేపట్టారు.

ఇటలీలోని అనేక నగరాల్లో ఆందోళనలు మిన్నంటాయి. రాజధాని మిలన్‌లో చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. పియాజ్జా డెల్ డువోమో, గ్యాలేరియా విట్టోరియో ఎమాన్యుయెలె 2 వంటి లగ్జరీ షాపింగ్ మాల్ ప్రాంతాల్లో ఆందోళన చేపట్టారు. అయితే, ఈ ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లు ప్రయోగించారు.

అయితే, ఆందోళనకారులు మరింత ఉద్రిక్తంగా మారారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. అనేక ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల్ని ధ్వంసం చేశారు. పలు షాపింగ్‌ మాళ్లను తగులబెట్టారు. అనేక షాపులను లూటీ చేశారు. ఈ ఆందోళన సమయంలో అక్కడి ఒక భారీ షాపింగ్ మాల్‌ను ఖాళీ చేయించాల్సి వచ్చింది. ఈ ఘర్షణల్లో అనేక మంది ఆందోళనకారులతోపాటు, పోలీసులు కూడా గాయపడ్డారు. 50 మంది ఆందోళనకారుల్ని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఈ ఆందోళనలను ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఖండించారు. శాంతియుతంగా ఆందోళన చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు.

ఆందోళన చేయడం ప్రజల హక్కు అని, గొప్ప ప్రజాస్వామ్యానికి నిరసనలు పునాదివంటివని అభిప్రాయపడ్డారు. అలాగని నగరాల్ని తగులబెట్టడం సరికాదని మెలోని అన్నారు. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడం, పోలీసులపై దాడి చేయడాన్ని తప్పుబట్టారు. ఈ దాడుల్ని, నిరసనల్ని ప్రతిపక్షాలు కూడా ఖండించాలని ఆమె సూచించారు. మరోవైపు ఫ్రాన్స్‌లో కూడా ఇలాగే ఆందోళనలు జరుగుతున్నాయి.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!Spirit New Poster | ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్ట‌ర్, రిలీజ్ డేట్ వ‌చ్చేసింది →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com