Nitin Gadkari: రైతులు కేవలం పంటలను పండించే అన్నదాతలుగానే కాకుండా, దేశానికి ఇంధనాన్ని అందించే ‘ఇంధన దాతలు’గా మారుతున్నారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఇథనాల్ వాడకం పెరగడం వల్ల అన్నదాతల ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని పేర్కొన్నారు. ఇది వారి ఆదాయాన్ని రెట్టింపు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన వివరించారు.

పెట్రోలియం దిగుమతులపై తగ్గుతున్న భారం
ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగం దేశ భవిష్యత్తుకు ఎంతో అవసరమని గడ్కరీ నొక్కిచెప్పారు. ఇథనాల్ వాడకాన్ని ప్రోత్సహించడం ద్వారా విదేశీ టెక్కెలపై, ముఖ్యంగా పెట్రోలియం దిగుమతులపై దేశం ఆధారపడే శాతాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు.
Read also: SBI Bank Strike 2026: సమ్మె వేళ SBI కస్టమర్లకు గుడ్‌న్యూస్.. 3 రోజులు ATM ఛార్జీలు ఉండవు
Nitin Gadkari: ప్రజా రవాణా వ్యవస్థకు పెద్దపీట
దేశంలో రవాణా రంగాన్ని హరిత ఇంధనాల వైపు మళ్లించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపరచడం, ఎలక్ట్రిక్ మరియు ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలను ప్రోత్సహించడం ద్వారా కాలుష్యాన్ని అరికట్టవచ్చని తెలిపారు. పర్యావరణహిత ప్రయాణ విధానాలను అవలంబించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :


