☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

నిద్ర మాత్రలు మింగి హెచ్ఎం ఆత్మహత్యాయత్నం..సమావేశంలోనే స్పృహ తప్పిన వైనం

నిద్ర మాత్రలు మింగి హెచ్ఎం ఆత్మహత్యాయత్నం..సమావేశంలోనే స్పృహ తప్పిన వైనం
నిద్ర మాత్రలు మింగి హెచ్ఎం ఆత్మహత్యాయత్నం..సమావేశంలోనే స్పృహ తప్పిన వైనం
నిద్ర మాత్రలు మింగి హెచ్ఎం ఆత్మహత్యాయత్నం..సమావేశంలోనే స్పృహ తప్పిన వైనం
  • అధికారుల వేధింపులే కారణం!

గొల్లపల్లి, వెలుగు: అధికారుల వేధింపులు తాళలేక ఓ ప్రధానోపాధ్యాయుడు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నం చేశారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని చిల్వకోడూరు ప్రైమరీ స్కూల్​లో హెచ్​ఎంగా విధులు నిర్వహిస్తున్న ప్రశాంత్ మండల కేంద్రంలోని జడ్పీ బాయ్స్​హైస్కూల్​లో మంగళవారం నిర్వహించిన స్కూల్ కాంప్లెక్స్ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం సందర్భంగా పాఠశాల రికార్డుల విషయమై అధికారులు నిలదీశారు. తోటి ఉపాధ్యాయుల సమక్షంలో తనను అవమానించారని ఆవేదనను గురై నిద్ర మాత్రలు మింగారు. కొద్దిసేపటికి సమావేశంలోనే స్పృహ తప్పి పడిపోయాడు. తోటి ఉపాధ్యాయులు ఆయనను జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. కాగా తనిఖీల పేరుతో అధికారులు తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రశాంత్ గతంలో తోటి ఉపాధ్యాయుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. తన ఆత్మహత్యకు ఉన్నతాధికారులే కారణమంటూ సూసైడ్ నోట్ రాసినట్లు సమాచారం. కాగా ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపట్టి బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్​ చేస్తున్నాయి.

html, body,
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← లంచ్‌బాక్స్‌లో మెంతి కూర తెచ్చినందుకు రూ.50 జరిమానా ! మహారాష్ట్ర స్కూలుకు మున్సిపల్ నోటీసువినియోగదారులకు నాణ్యమైన సేవలందిస్తాం : పంజాబ్ నేషనల్ బ్యాంక్ జోనల్హెడ్ వందన పాండే →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com