☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

వినియోగదారులకు నాణ్యమైన సేవలందిస్తాం : పంజాబ్ నేషనల్ బ్యాంక్ జోనల్హెడ్ వందన పాండే

వినియోగదారులకు నాణ్యమైన సేవలందిస్తాం : పంజాబ్ నేషనల్ బ్యాంక్ జోనల్హెడ్ వందన పాండే
వినియోగదారులకు నాణ్యమైన సేవలందిస్తాం : పంజాబ్ నేషనల్ బ్యాంక్ జోనల్హెడ్ వందన పాండే
వినియోగదారులకు నాణ్యమైన సేవలందిస్తాం : పంజాబ్ నేషనల్ బ్యాంక్ జోనల్హెడ్ వందన పాండే

నాగర్​కర్నూల్, వెలుగు : పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​ వినియోగదారులు, ఖాతాదారులకు సులభమైన విధానంలో నాణ్యమైన, నమ్మకమైన సేవలందిస్తామని బ్యాంక్​ హైదరాబాద్​ జోనల్​ హెడ్​ జనరల్​ మేనేజర్​ వందన పాండే అన్నారు. నాగర్​ కర్నూల్​ జిల్లా కేంద్రంలో కొత్త శాఖ ప్రారంభించడం ద్వారా స్థానికులు, వ్యాపార, వాణిజ్యవర్గాలు, వివిధ సంస్థలకు తమ బ్యాంకు ద్వారా సేవలందిస్తామని ఆమె భరోసా ఇచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్​ హేమంత కేశవ పాటిల్, సర్కిల్​హెడ్ అరవింద్​ కల్ర, మున్సిపల్​ చైర్మన్​ తీగల సునేంద్ర తదితరులతో కలిసి పంజాబ్​ నేషనల్​బ్యాంక్​ 79వ బ్రాంచిని ప్రారంభించారు.

హైదరాబాద్​ సర్కిల్​ పరిధిలో 78 బ్యాంక్​ బ్రాంచిల ద్వారా వినియోగదారులకు సేవలందించడంలో పంజాబ్​ నేషనల్​ బ్యాంకు ముందుందని వారు తెలిపారు. కలెక్టర్​ హేమంత కేశవ పాటిల్​మాట్లాడుతూ పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​ జిల్లా కేంద్రంలో ప్రారంభించిన కొత్త బ్రాంచి ద్వారా వినియోగదారులకు బ్యాంకింగ్​ సేవలతో పాటు ఆర్థిక, సామాజిక సేవలకు తోడ్పాటునివ్వాలని కోరారు. సర్కిల్​హెడ్​ కల్ర మాట్లాడుతూ వినియోగదారులకు తమ బ్రాంచిలో ఆధునిక డిజిటల్​ సేవా సదుపాయాలతో పాటు వినియోగదారుల నమ్మకాన్నీ చూరగొనేలా పనిచేస్తామన్నారు. లోకల్​ బ్రాంచి మేనేజర్ హరీశ్​బాబు పాల్గొన్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG
← నిద్ర మాత్రలు మింగి హెచ్ఎం ఆత్మహత్యాయత్నం..సమావేశంలోనే స్పృహ తప్పిన వైనంSalakatla Brahmotsavams | పుష్కరిణిలో చక్రస్నానంతో ముగిసిన తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com