☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

జార్ఖండ్‎లో రోడ్డు ప్రమాదం.. మంత్రి దీపికా పాండే సింగ్ కుమార్తె త్రిషా సింగ్ సహా నలుగురు మృతి

జార్ఖండ్‎లో రోడ్డు ప్రమాదం.. మంత్రి దీపికా పాండే సింగ్ కుమార్తె త్రిషా సింగ్ సహా నలుగురు మృతి
జార్ఖండ్‎లో రోడ్డు ప్రమాదం.. మంత్రి దీపికా పాండే సింగ్ కుమార్తె త్రిషా సింగ్ సహా నలుగురు మృతి
జార్ఖండ్‎లో రోడ్డు ప్రమాదం.. మంత్రి దీపికా పాండే సింగ్ కుమార్తె త్రిషా సింగ్ సహా నలుగురు మృతి

రాంచీ: జార్ఖండ్‎లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంచీ-జంషెడ్‎పూర్ హైవేపై అతివేగంగా దూసుకెళ్లిన కారు రోడ్డుపై నిలిపి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దీపికా పాండే సింగ్ కుమార్తె త్రిషా సింగ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

జంషెడ్‎పూర్‎లోని సోనారి పోలీస్ స్టేషన్ పరిధిలోని డోముహాని మెరైన్ డ్రైవ్ సమీపంలో గురువారం (సెప్టెంబర్ 24) తెల్లవారుజూమున ఈ ఘటన చోటు చేసుకుంది. రిపేర్ రావడంతో రోడ్డు మధ్యలోనే ట్రక్‎ను నిలిపి వెళ్లిపోయాడు డ్రైవర్. ఈ క్రమంలో అతివేగంగా దూసుకొచ్చిన కారు ట్రక్‎ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో మంత్రి దీపికా కుమార్తె త్రిషాతో సహా నలుగురు మరణించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. గ్యాస్ కట్టర్‎తో కారును కోసి వాహనంలో ఉన్న నలుగురినీ బయటకు తీశారు. అనంతరం వారిని మహాత్మా గాంధీ మెమోరియల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కు తరలించగా.. అప్పటికే వారు మరణించినట్లు మరణించినట్లు ప్రకటించారు.

పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్‎తో పాటు మంత్రులు, పలువురు రాజకీయ నేతలు మంత్రి దీపికా సింగ్ కుమార్తె త్రిషా మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీపికా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని.. ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబానికి శక్తిని ప్రసాదించాలని భగవంతున్ని కోరకుంటున్నానని తెలిపారు.

html, body,
⬇ Full News JPG⬇ Short News JPG
← ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఎందుకు వస్తుంది..? దానంపై అనర్హత వెనక కారణం ఏంటీ..?Rigorous Imprisonment: బాలుడిపై లైంగిక వేధింపులు.. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష‌ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com