☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Rigorous Imprisonment: బాలుడిపై లైంగిక వేధింపులు.. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష‌

Rigorous Imprisonment: బాలుడిని లైంగికంగా వేధించిన కేసులో ఓ నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష ప‌డింది. మ‌హారాష్ట్ర‌లోని పాల్గ‌ర్ కోర్టు ఆ తీర్పును ఇచ్చింది. డిఫెన్స్ చేసిన వాద‌న‌ల‌ను కోర్టు కొట్టిపారేసింది. 2020 డిసెంబ‌ర్ 12వ తేదీన ఈ లైంగిక దాడి ఘ‌ట‌న జ‌రిగింది.
Rigorous Imprisonment: బాలుడిపై లైంగిక వేధింపులు.. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష‌

పాల్గ‌ర్‌: మైన‌ర్ బాలుడిని లైంగికంగా వేధించిన కేసులో ఓ నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష(Rigorous Imprisonment) ప‌డింది. మ‌హారాష్ట్ర‌లోని పాల్గ‌ర్ కోర్టు ఆ తీర్పును ఇచ్చింది. డిఫెన్స్ చేసిన వాద‌న‌ల‌ను కోర్టు కొట్టిపారేసింది. జ‌న సాంద్ర‌త ఉన్న ప్ర‌దేశంలో ఇలాంటివి జ‌ర‌గ‌వ‌ని వాదించినా.. కోర్టు మాత్రం ఆ అభిప్రాయాల‌ను తిర‌స్క‌రించింది. బాధితుడి వాంగ్మూలాన్ని తీసివేయ‌లేమ‌ని కోర్టు చెప్పింది. స్పెష‌ల్ జ‌డ్జీ ఏహెచ్ క‌షికార్ తీర్పును ఇస్తూ 41 ఏళ్ల మ‌ధు ధ‌ర్మ గోవారిని నిందితుడిగా తేల్చాఉ.పాల్గ‌ర్ జిల్లాలోని వ‌సాయికి చెందిన అతనిపై ఐపీసీ, పోక్సో చ‌ట్టం కింద కేసు బుక్ చేశారు. లైంగిక దాడి జ‌రిగిన స‌మ‌యంలో బాలుడి వ‌య‌సు 14 ఏళ్లు మాత్ర‌మే. 2020 డిసెంబ‌ర్ 12వ తేదీన ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఆ రోజున ఇంటిపై పావురాల‌కు దానా వేస్తున్న స‌మ‌యంలో ప‌క్కింటిలో ఉన్న నిందితుడు ఆ చిన్నారిని బ‌ల‌వంతంగా రూమ్‌లోకి తీసుకెళ్లాడు. చేతులు క‌ట్టేసి, లైంగికంగా వేధించాడు.కానీ చివ‌ర‌కు ఆ బాలుడు అక్క‌డ నుంచి పారిపోయాడు. జ‌రిగిన సంఘ‌ట‌న గురించి ఇంట్లో వాళ్ల‌కు చెప్ప‌డంతో.. పోలీసుల‌కు తెలియ‌జేశారు. దీంతో ఎఫ్ఐఆర్ న‌మోదు చేసి విచార‌ణ చేప‌ట్టారు. పోక్సో చ‌ట్టం కింద నిందితుడికి 20 ఏళ్ల క‌ఠిన శిక్ష విధించారు. ఐపీసీలోని 377 సెక్ష‌న్ ప్ర‌కారం ప‌దేళ్ల జైలుశిక్ష ప‌డింది. 30 వేల ఫైన్ వేశారు. ఆ అమౌంట్‌ను బాధితుడికి ఇవ్వాల‌ని ఆదేశించారు. రూల్స్ ప్ర‌కారం బాధితుడికి మ‌రింత ఆర్థిక సాయం చేయాల‌ని స్థానిక అధికారుల‌ను కోర్టు ఆదేశించింది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← జార్ఖండ్‎లో రోడ్డు ప్రమాదం.. మంత్రి దీపికా పాండే సింగ్ కుమార్తె త్రిషా సింగ్ సహా నలుగురు మృతిభద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ బృందాన్ని అడ్డుకున్న పోలీసులు : వీడియో →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com