☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
వేగంగా దూసుకొస్తున్న కారు.. ఆపి చెక్ చేసిన పోలీసుల మైండ్‌బ్లాక్..! • అబీయేలోని మార్కెట్‌పై డ్రోన్ దాడి: 153 మంది మృతి • పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో సీట్లు • Son of Kanaka Durgamma : అమ్మవారి అవతారంలో లయ.. ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ పోస్టర్ అదిరిందిగా! • Ration Card : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రేషన్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త.. • సౌరవ్ దాస్,అశుతోష్ రాంకాలపై నమోదైన రెండో కేసు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ • పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి.. సీఎం రేవంత్ కీలక ప్రకటన • ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు! •

Jio Platforms IPO: జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ నేడు ప్రారంభం.. రూ.30,188 కోట్ల ఇష్యూ, జీఎంపీ, లిస్టింగ్ ధర ఎంత?

Jio Platforms IPO: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన డిజిటల్ సేవల సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ ఐపీఓ (IPO) నేటి నుంచి ప్రారంభం కానున్నది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.30,188 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అక్టోబర్ 23 వరకు ఈ ఐపీఓలో పెట్టుబడిదారులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐపీఓలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్ల కోసం రూ.8,110 కోట్ల విలువైన షేర్లను కేటాయించగా, దీనికి 30 రెట్లకు పైగా బిడ్లు వచ్చినట్లు సమాచారం. అంతర్జాతీయ ఆస్తుల […]
Jio Platforms IPO: జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ నేడు ప్రారంభం.. రూ.30,188 కోట్ల ఇష్యూ, జీఎంపీ, లిస్టింగ్ ధర ఎంత?

Jio Platforms IPO: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన డిజిటల్ సేవల సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ ఐపీఓ (IPO) నేటి నుంచి ప్రారంభం కానున్నది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.30,188 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అక్టోబర్ 23 వరకు ఈ ఐపీఓలో పెట్టుబడిదారులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐపీఓలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్ల కోసం రూ.8,110 కోట్ల విలువైన షేర్లను కేటాయించగా, దీనికి 30 రెట్లకు పైగా బిడ్లు వచ్చినట్లు సమాచారం. అంతర్జాతీయ ఆస్తుల నిర్వహణ సంస్థలు, సావరిన్ వెల్త్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్‌తో పాటు దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు ఆసక్తి చూపినట్లు పేర్కొంది.

విదేశీ పెట్టుబడిదారుల్లో బ్లాక్‌రాక్, ఫిడెలిటీ, జేపీ మోర్గాన్ అసెట్ మేనేజ్‌మెంట్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, క్యాపిటల్ గ్రూప్ వంటి సంస్థల పేర్లు ఉన్నాయి. సింగపూర్‌కు చెందిన GIC, అబుదాబి, ఖతార్ ప్రభుత్వ పెట్టుబడి నిధులు కూడా ఆసక్తి చూపాయి. దేశీయంగా ఎస్‌బీఐ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్, నిప్పాన్ ఇండియా వంటి మ్యూచువల్ ఫండ్స్‌తో పాటు ఎల్‌ఐసీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎస్‌బీఐ లైఫ్ సంస్థల భాగస్వామ్యం ఉన్నట్లు సమాచారం.

రిటైల్ పెట్టుబడిదారులు కనీసం ఒక లాట్‌ అంటే 12 షేర్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎగువ ధరల శ్రేణి వద్ద ఈ పెట్టుబడికి రూ.13,428 అవసరమవుతుంది. గరిష్ఠంగా 14 లాట్లకు, అంటే 168 షేర్లకు బిడ్లు వేయవచ్చు. జియో ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) సుమారు రూ.252గా ఉంది. ఈ అంచనా ప్రకారం షేరు లిస్టింగ్ ధర రూ.1,371 సమీపంలో ఉండవచ్చని, సుమారు 22.5 శాతం లిస్టింగ్ లాభం వచ్చే అవకాశం ఉందని అంచనాలు వెలువడ్డాయి. అయితే, గ్రే మార్కెట్ ప్రీమియం అనేది అనధికారిక సూచిక మాత్రమే. ఇది మారుతూ ఉంటుంది. లిస్టింగ్ ధర లేదా లాభాలకు ఎలాంటి హామీ ఉండదు.

జియో ప్లాట్‌ఫామ్స్ రిలయన్స్ గ్రూప్ టెలికాం, డిజిటల్ వ్యాపారాల్లో కీలక సంస్థ. 50 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్న రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఈ వ్యాపార వ్యవస్థలో ముఖ్యమైన భాగంగా ఉంది. టెలికాం సేవలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ సేవలు, ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ రంగాల్లోనూ విస్తరించేందుకు కంపెనీ దృష్టి సారిస్తోంది. ఐపీఓలో పెట్టుబడి పెట్టే ముందు కంపెనీ ఆర్థిక ఫలితాలు, అప్పులు, విలువ నిర్ధారణ, భవిష్యత్తు వృద్ధి అవకాశాలు, ఐపీఓ ధరను పరిశీలించడం అవసరం. గ్రే మార్కెట్ ప్రీమియం ఎక్కువగా ఉందనే కారణంతో మాత్రమే పెట్టుబడి నిర్ణయం తీసుకోకూడదు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Sudan Drone Attack: సూడాన్‌లో డ్రోన్ దాడి.. పిల్లలతో సహా 153 మంది మృతి..!Astrology: అక్టోబర్‌ 21 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారు పట్టిందల్లా బంగారమే..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com