☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Jurala Water: జూరాల నీటిపై మంత్రి కీలక ఆదేశాలు..!

Jurala Water: కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో పలువురు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రులు జూపల్లి, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్‌రెడ్డి, ముధుసూదన్‌రెడ్డి, మేఘారెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణకు కృష్ణా జలాలు విడుదల చేయాలని వారు కోరారు. నారాయణపూర్‌ నుంచి జూరాలకు నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతుల దుస్థితిని డీకేకు వివరించారు. జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌ ఆయకట్టు పంటలను కాపాడాలని విజ్ఞప్తి […]
Jurala Water: జూరాల నీటిపై మంత్రి కీలక ఆదేశాలు..!

Jurala Water: కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో పలువురు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రులు జూపల్లి, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్‌రెడ్డి, ముధుసూదన్‌రెడ్డి, మేఘారెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణకు కృష్ణా జలాలు విడుదల చేయాలని వారు కోరారు. నారాయణపూర్‌ నుంచి జూరాలకు నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతుల దుస్థితిని డీకేకు వివరించారు. జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌ ఆయకట్టు పంటలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

ఈ 4 ప్రాజెక్టుల కింద 5.5 లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతోందని వివరించారు. ప్రస్తుతం ఆయకట్టు పరిధిలోని పంటలు కీలక దశలో ఉన్నాయని.. నీటి కొరత వస్తే పంట దిగుబడులపై ప్రభావం పడుతుందని వివరించారు. అంతేకాకుండా రైతుల ఆదాయం, జీవనోపాధిపై ప్రభావం పడుతుందని మంత్రులు తెలిపారు. నెలలో 5 వేల క్యూసెక్కుల కృష్ణా జలాలు విడుదల చేయాలని కోరారు. మంత్రుల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన సీఎం డీకే శివకుమార్‌.. తెలంగాణ రైతులకు లాభం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ నేపథ్యంలోనే మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేశారు అధికారులు. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సానుకూల నిర్ణయంతో నీటి విడతలకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు కూడా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు బెంగళూరులోనే ఉన్నారు. గతరాత్రి కర్ణాటక ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. నారాయణపూర్ నుండి జూరాలకు దశలవారీగా 15 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఎమ్మెల్యేలు కోరారు. ఈరోజు మరోసారి కర్ణాటక సీఎం, ఇరిగేషన్ మంత్రి, అధికారులతో ఎమ్మెల్యేలు భేటీకానున్నారు. నారాయణపూర్ లో ప్రస్తుతం 28 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← NIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్‌ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..!Ajith Kumar Fans: అజిత్ అభిమానుల సంచలన నిర్ణయం.. తమిళనాడులో మరో పార్టీ ఎంట్రీ! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com