☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

NIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్‌ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..!

NIMS Doctor Lakshmi Bhaskar: నిమ్స్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్‌పై అక్రమాస్తుల కేసులో ఏసీబీ అధికారులు చేపట్టిన సోదాల్లో భారీగా ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. సుమారు 14 గంటలకు పైగా కొనసాగిన సోదాల్లో దాదాపు రూ.100 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలతో పాటు బంగారు ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎర్రగడ్డలోని కల్పతరువు అపార్ట్‌మెంట్‌లో ఉన్న డాక్టర్ లక్ష్మీ భాస్కర్ నివాసంతో పాటు ఆయనకు […]
NIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్‌ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..!

NIMS Doctor Lakshmi Bhaskar: నిమ్స్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్‌పై అక్రమాస్తుల కేసులో ఏసీబీ అధికారులు చేపట్టిన సోదాల్లో భారీగా ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. సుమారు 14 గంటలకు పైగా కొనసాగిన సోదాల్లో దాదాపు రూ.100 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలతో పాటు బంగారు ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఎర్రగడ్డలోని కల్పతరువు అపార్ట్‌మెంట్‌లో ఉన్న డాక్టర్ లక్ష్మీ భాస్కర్ నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన బినామీలు, బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తం ఏడు ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టారు. సోదాల్లో పలు ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు లభించినట్లు అధికారులు తెలిపారు. యాదాద్రి, నందిగామ, షామీర్‌పేట ప్రాంతాల్లో ఆస్తులను ఏసీబీ గుర్తించింది. షామీర్‌పేటలో నాలుగు ఓపెన్ ఫ్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఉకట్‌పల్లి, మణికొండ, పేట్‌బషీరాబాద్ ప్రాంతాల్లోని హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీల్లోనూ పలు ఫ్లాట్ల వివరాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

సోదాల సందర్భంగా అర కిలోకు పైగా బంగారు ఆభరణాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటితో పాటు వివిధ ఆస్తులకు సంబంధించిన పత్రాలను కూడా అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గుర్తించిన ఆస్తుల విలువను అధికారులు మరింతగా పరిశీలిస్తున్నారు. డాక్టర్ లక్ష్మీ భాస్కర్‌కు సంబంధించిన బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ.41 లక్షల నగదు ఉన్నట్లు ఏసీబీ గుర్తించారు. పోస్టాఫీసుల్లో రూ.12 లక్షల డిపాజిట్లు, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల్లో రూ.35 లక్షల పెట్టుబడులు ఉన్నట్లు గుర్తించారు. అలాగే సుమారు రూ.30 లక్షల విలువైన మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

సోదాలు పూర్తైన తర్వాత.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్‌ను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. రాత్రి ఒంటి గంట ప్రాంతంలో జైలుకు తరలించారు. డాక్టర్ లక్ష్మీ భాస్కర్‌కు సంబంధించిన ఆస్తుల్లో కొంతమంది బినామీల పాత్రను కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. వారి వివరాలను సేకరించి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. బినామీలను విచారించిన తర్వాత డాక్టర్ లక్ష్మీ భాస్కర్‌ను కస్టడీలోకి తీసుకుని మరింత విచారణ చేపట్టే అవకాశం ఉంది.

ఆస్తుల వివరాలను పరిశీలించే క్రమంలో డాక్టర్ లక్ష్మీ భాస్కర్ పలుమార్లు విదేశీ పర్యటనలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న సమయంలో ఇంత భారీగా ఆస్తులు ఎలా సమకూరాయనే అంశంపై దర్యాప్తు చేపట్టనున్నారు. కస్టడీ విచారణలో ఆస్తుల సమీకరణ, బినామీల పాత్ర, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← PPF-SSY Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల వడ్డీ రేట్లలో మార్పులు..? ఈ నెల 30న ప్రకటన..Jurala Water: జూరాల నీటిపై మంత్రి కీలక ఆదేశాలు..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com