☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

PPF-SSY Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల వడ్డీ రేట్లలో మార్పులు..? ఈ నెల 30న ప్రకటన..

చిన్న మొత్తాల పొదుపు పథకాలపై పెట్టుబడిదారులకు సెప్టెంబర్ 30వ తేదీ ముఖ్యమైనది. పీపీఎఫ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY), కిసాన్ వికాస్ పత్ర (KVP) వంటి పథకాలపై అక్టోబర్-డిసెంబర్ 2026 త్రైమాసికానికి సంబంధించి వడ్డీ రేట్లను ప్రభుత్వం సెప్టెంబర్ 30న సమీక్షించనుంది. గత జూన్ 30న జరిగిన త్రైమాసిక సమీక్షలో వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇప్పుడు మరోసారి రేట్లు మారుతాయా లేదా ప్రస్తుత స్థాయిలోనే కొనసాగుతాయా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. […]
PPF-SSY Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల వడ్డీ రేట్లలో మార్పులు..? ఈ నెల 30న ప్రకటన..

చిన్న మొత్తాల పొదుపు పథకాలపై పెట్టుబడిదారులకు సెప్టెంబర్ 30వ తేదీ ముఖ్యమైనది. పీపీఎఫ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY), కిసాన్ వికాస్ పత్ర (KVP) వంటి పథకాలపై అక్టోబర్-డిసెంబర్ 2026 త్రైమాసికానికి సంబంధించి వడ్డీ రేట్లను ప్రభుత్వం సెప్టెంబర్ 30న సమీక్షించనుంది. గత జూన్ 30న జరిగిన త్రైమాసిక సమీక్షలో వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇప్పుడు మరోసారి రేట్లు మారుతాయా లేదా ప్రస్తుత స్థాయిలోనే కొనసాగుతాయా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఈ పథకాల వడ్డీ రేట్లను నిర్ణయించడంలో ప్రభుత్వ బాండ్ల రాబడి కీలక పాత్ర పోషిస్తుంది. జూన్ చివరి నుంచి లాంగ్ టర్మ్ ప్రభుత్వ బాండ్ల ఈల్డ్ లో స్వల్ప పెరుగుదల నమోదైంది. ఉదాహరణకు జూన్ 30 నాటికి సుమారు 6.74 శాతం ఉన్న 10 ఏళ్ల ప్రభుత్వ బాండ్ ఈల్డ్, సెప్టెంబర్ 22 నాటికి దాదాపు 7.05 శాతానికి పెరిగింది. అంటే ఈ కాలంలో సుమారు 31 బేసిస్ పాయింట్ల వృద్ధి కనిపించింది. బాండ్ ఈల్డ్ పెరిగినంత మాత్రాన ప్రభుత్వం అదే నిష్పత్తిలో చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను పెంచుతుందని చెప్పలేము. దీనిపై తుది నిర్ణయం పూర్తిగా ప్రభుత్వానిదే.

పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలు దీర్ఘకాలిక పెట్టుబడులకు ఎంతో ప్రాచుర్యం పొందాయి. వీటిలో వచ్చే చిన్న మార్పులు కూడా భవిష్యత్తులో అందే మొత్తం రిటర్న్‌పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. అలాగే కిసాన్ వికాస్ పత్రలో వడ్డీ రేటుతో పాటు మెచ్యూరిటీ కాల వ్యవధి కూడా ఇన్వెస్టర్లకు చాలా కీలకం. ప్రభుత్వ అధికారిక ప్రకటన వెలువడే వరకు వడ్డీ రేట్ల పెంపుపై స్పష్టత రాదు. సెప్టెంబర్ 30న వెలువడే ఈ కొత్త వడ్డీ రేట్లు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు తదుపరి మూడు నెలల కాలానికి అమల్లోకి వస్తాయి. ప్రస్తుతం పీపీఎఫ్ వడ్డీ రేటు 7.1 శాతం ఉండగా.. సుకన్య సమృద్ధి యోజన పథకం వడ్డీ రేటు 8.2 శాతంగా ఉంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← BRS pressure forces Congress government to seek Karnataka water releaseNIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్‌ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com