☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

IND vs WI 2nd ODI: టీమిండియా బౌలర్లకు ఎగిరి గంతేసే వార్త.. రెండో వన్డే నుంచి విండీస్‌ సెంచరీ హీరో ఔట్!

Justin Greaves Ruled Out From 2nd ODI vs India: భారత్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే 0-1తో వెనుకబడిన వెస్టిండీస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్, సెంచరీ హీరో జస్టిన్ గ్రీవ్స్ గాయం కారణంగా రెండో వన్డే మ్యాచ్‌కు దూరమయ్యాడు. కాలి కండరం గాయం కారణంగా అతడు కీలక మ్యాచ్‌కు దూరం అయ్యాడు. గ్రీవ్స్ స్థానంలో యువ ఆటగాడు జ్యువెల్ ఆండ్రూను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు పంపే అవకాశాలు ఉన్నాయి. రెండో […]
IND vs WI 2nd ODI: టీమిండియా బౌలర్లకు ఎగిరి గంతేసే వార్త.. రెండో వన్డే నుంచి విండీస్‌ సెంచరీ హీరో ఔట్!

Justin Greaves Ruled Out From 2nd ODI vs India: భారత్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే 0-1తో వెనుకబడిన వెస్టిండీస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్, సెంచరీ హీరో జస్టిన్ గ్రీవ్స్ గాయం కారణంగా రెండో వన్డే మ్యాచ్‌కు దూరమయ్యాడు. కాలి కండరం గాయం కారణంగా అతడు కీలక మ్యాచ్‌కు దూరం అయ్యాడు. గ్రీవ్స్ స్థానంలో యువ ఆటగాడు జ్యువెల్ ఆండ్రూను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు పంపే అవకాశాలు ఉన్నాయి. రెండో వన్డే ఈరోజు మధ్యాహ్నం గువాహటిలో జరగనుంది.

తిరువనంతపురంలో జరిగిన తొలి వన్డేలో జస్టిన్ గ్రీవ్స్ అద్భుతమైన బ్యాటింగ్‌తో అలరించాడు. 108 బంతుల్లో 101 పరుగులు చేశాడు. ఇది అతడి కెరీర్‌లో తొలి వన్డే సెంచరీ కావడం విశేషం. అయితే ఈ ఇన్నింగ్స్ సమయంలోనే గ్రీవ్స్ కాలి కండరానికి గాయం అయింది. మ్యాచ్ అనంతరం నిర్వహించిన పరీక్షల్లో గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో.. రెండో వన్డేకు అతడిని దూరంగా ఉంచాలని వెస్టిండీస్ క్రికెట్ నిర్ణయించింది. గ్రీవ్స్ రెండో వన్డేకు అందుబాటులో ఉండడని క్రికెట్ వెస్టిండీస్ వెల్లడించింది.

తొలి వన్డేలో బ్రాండన్ కింగ్‌తో కలిసి గ్రీవ్స్ తొలి వికెట్‌కు 135 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో వెస్టిండీస్ భారీ స్కోరుకు బలమైన పునాది పడింది. అనంతరం అమీర్ జాంగూ కూడా రాణించడంతో విండీస్ 50 ఓవర్లలో 295/7 పరుగులు చేసింది. అయితే విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ సెంచరీలతో చెలరేగడంతో భారత్ 41.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇప్పుడు సిరీస్‌ను సమం చేయాలంటే రెండో వన్డేలో వెస్టిండీస్ తప్పక గెలవాల్సి ఉంది. ఇలాంటి కీలక సమయంలో ఫామ్‌లో ఉన్న గ్రీవ్స్ దూరం కావడం ఆ జట్టుకు పెద్ద లోటుగా మారింది. తొలి వన్డేలో టీమిండియా బౌలర్లపై గ్రీవ్స్ చెలరేగిన విషయం తెలిసిందే.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← SBI ATM Rules Change: ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ATM నిబంధనల్లో కీలక మార్పులుAPPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com