☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..

ఏపీపీఎస్సీ గ్రూప్-1 జవాబు పత్రాల మూల్యాంకనంపై ఏపీ హైకోర్టులో తుది విచారణ కొనసాగుతోంది. ఉద్యోగాలకు ఎంపిక కాని అభ్యర్థుల తరఫు న్యాయవాదులు, ఎంపిక ప్రక్రియలో ప్రతి దశలోనూ అక్రమాలు జరిగాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఉద్యోగాలకు ఎంపికైన 160 మంది అభ్యర్థుల ఓయమ్మార్‌ స్లిప్పుల్లో దిద్దుబాట్లు, ఓవర్‌రైటింగ్‌ ఉన్నాయని వారు వాదించారు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఏపీపీఎస్సీ తన విధి నిర్వహణలో అన్ని రకాలుగా విఫలమైందని ఎంపిక కాని అభ్యర్థుల తరఫు న్యాయవాదులు ఆరోపించారు. మూల్యాంకన […]
APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..

ఏపీపీఎస్సీ గ్రూప్-1 జవాబు పత్రాల మూల్యాంకనంపై ఏపీ హైకోర్టులో తుది విచారణ కొనసాగుతోంది. ఉద్యోగాలకు ఎంపిక కాని అభ్యర్థుల తరఫు న్యాయవాదులు, ఎంపిక ప్రక్రియలో ప్రతి దశలోనూ అక్రమాలు జరిగాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఉద్యోగాలకు ఎంపికైన 160 మంది అభ్యర్థుల ఓయమ్మార్‌ స్లిప్పుల్లో దిద్దుబాట్లు, ఓవర్‌రైటింగ్‌ ఉన్నాయని వారు వాదించారు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఏపీపీఎస్సీ తన విధి నిర్వహణలో అన్ని రకాలుగా విఫలమైందని ఎంపిక కాని అభ్యర్థుల తరఫు న్యాయవాదులు ఆరోపించారు. మూల్యాంకన ప్రక్రియలో చోటుచేసుకున్న అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

మరోవైపు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తరఫున సీనియర్‌ న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. హైల్యాండ్‌లో జరిగిన మూల్యాంకనం నిబంధనలకు అనుగుణంగా జరగలేదనే కారణంతోనే విజయవాడలో మరోసారి మూల్యాంకనం చేయాలని ఏపీపీఎస్సీ చైర్మన్‌ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఎగ్జామినర్లు చేసిన పొరపాట్లకు అభ్యర్థులను బాధ్యులను చేయడానికి వీల్లేదని ఎంపికైన అభ్యర్థుల తరఫు న్యాయవాదులు వాదించారు. అలాగే అభ్యర్థుల ఎంపికలో అక్రమాలు జరిగినట్లు సిట్‌ ఎక్కడా నిర్ధారించలేదని కోర్టుకు వివరించారు. ఈ వ్యవహారంపై ఇరువర్గాల వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీ హైకోర్టులో విచారణ నేడు కూడా కొనసాగనుంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← IND vs WI 2nd ODI: టీమిండియా బౌలర్లకు ఎగిరి గంతేసే వార్త.. రెండో వన్డే నుంచి విండీస్‌ సెంచరీ హీరో ఔట్!IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com