☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కరవు ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు గుడ్‌న్యూస్.. 15 రోజుల్లో జాబ్‌కార్డులు • Viral Video: పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. ఎలా ఏడ్చాడో చూడండి! వీడియో వైరల్ • వాస్తు ప్రకారం.. ఇంట్లో తులసి మొక్కను ఉంచకూడని ప్రదేశాలు • నేడు స్థిరంగా బంగారం ధరలు • అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి • Sarpanch Suicide Attempt | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధింపులు.. కరీంనగర్‌ జిల్లాలో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం! • OTT Cinema : థియేటర్లలో సంచలనం.. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్.. ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా.. • Video: ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా..! •

IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!

Vivo Y600i Launched: వివో Y600 సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ vivo Y600iని అధికారికంగా విడుదల చేసింది. బడ్జెట్‌ విభాగాన్ని లక్ష్యంగా చేసుకున్న ఈ ఫోన్‌లో 120Hz డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, IP68+IP69 వాటర్‌ప్రూఫ్ రేటింగ్‌తో పాటు భారీ 8,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. రోజువారీ వినియోగంతో పాటు ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్‌ను రూపొందించారు. 50MP కెమెరా ఫోటోగ్రఫీ కోసం వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరాను […]
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!

Vivo Y600i Launched: వివో Y600 సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ vivo Y600iని అధికారికంగా విడుదల చేసింది. బడ్జెట్‌ విభాగాన్ని లక్ష్యంగా చేసుకున్న ఈ ఫోన్‌లో 120Hz డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, IP68+IP69 వాటర్‌ప్రూఫ్ రేటింగ్‌తో పాటు భారీ 8,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. రోజువారీ వినియోగంతో పాటు ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్‌ను రూపొందించారు.

50MP కెమెరా

ఫోటోగ్రఫీ కోసం వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరాను అందించారు. ఇది f/1.8 అపెర్చర్‌తో వస్తుంది. LED ఫ్లాష్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8MP కెమెరాను ఇచ్చారు. ఇందులో f/2.05 అపెర్చర్ ఉంటుంది. vivo Y600iలో IP68 + IP69 డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌ రేటింగ్‌లు ఉన్నాయి. దీంతో దుమ్ము, నీటి నుంచి ఫోన్‌కు మెరుగైన రక్షణ లభిస్తుంది. అంతేకాకుండా ఫోన్‌కు SGS గోల్డ్ స్టాండర్డ్ డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ కూడా లభించింది.

8,000mAh భారీ బ్యాటరీ

vivo Y600iలో ప్రధాన ఆకర్షణల్లో ఒకటి 8,000mAh బ్యాటరీ. ఇది 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ దీర్ఘకాలిక పనితీరుపైనా కంపెనీ దృష్టి పెట్టింది. 1,500 ఛార్జింగ్ సైకిళ్లు పూర్తయిన తర్వాత కూడా బ్యాటరీ హెల్త్ 80 శాతానికి పైగా ఉండేలా రూపొందించినట్లు వివో పేర్కొంది.

120Hz డిస్‌ప్లే

vivo Y600iలో 6.87 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను అందించారు. ఇది 1592×720 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. స్క్రీన్ గరిష్ఠంగా 1,300 నిట్స్ HBM బ్రైట్‌నెస్ను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ Android 16 ఆధారిత OriginOS 6పై పనిచేస్తుంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అందించారు. కనెక్టివిటీ పరంగా 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11ac, Bluetooth 5.1, GPS, GLONASS, BeiDou వంటి ఫీచర్లు ఉన్నాయి. USB Type-C పోర్ట్‌ను కూడా అందించారు.

స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్

పనితీరు కోసం ఈ ఫోన్‌లో 4nm స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 మొబైల్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించారు. ఇందులో రెండు పనితీరు కోర్లు 2.2GHz వరకు, ఆరు ఎఫిషియెన్సీ కోర్లు 2GHz వరకు క్లాక్ స్పీడ్‌తో పనిచేస్తాయి. గ్రాఫిక్స్ కోసం అడ్రినో 613 GPU ఉంది. ఫోన్‌లో 6GB LPDDR4X RAM అందించారు. స్టోరేజ్ పరంగా 128GB, 256GB ఆప్షన్లు ఉన్నాయి. UFS 2.2 స్టోరేజ్‌ను ఉపయోగించారు.

ధర

vivo Y600i మొబైల్ బేబీస్ బ్రీత్, క్లియర్ బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.చైనాలో ధరలు ఇలా ఉన్నాయి..

* 6GB + 128GB: 1,699 యువాన్లు (సుమారు రూ.24,325)
* 6GB + 256GB: 1,999 యువాన్లు (సుమారు రూ.28,660)

ప్రస్తుతం 256GB వేరియంట్ చైనాలో విక్రయానికి అందుబాటులోకి వచ్చింది. 128GB వేరియంట్ త్వరలోనే అమ్మకానికి రానుంది. భారత్‌లో ఈ ఫోన్‌ విడుదలపై కంపెనీ నుంచి ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com