Amitabh Bachchan: బాలీవుడ్ నటుడు, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రమాదవశాత్తు గాయపడ్డారు. ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ టెలివిజన్ రియాలిటీ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (KBC) సెట్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. షూటింగ్‌లో భాగంగా నడుస్తుండగా ఆయన ప్రమాదవశాత్తు జారిపడటంతో ఎడమ మోకాలికి గాయమైంది. ఈ విషయాన్ని అమితాబ్ స్వయంగా కేబీసీ షోలోనే వెల్లడించారు.

Amitabh Bachchan: షోలోనే గాయం గురించి వెల్లడించిన బిగ్ బీ
కేబీసీ తాజా ఎపిసోడ్ ప్రారంభంలో అమితాబ్ బచ్చన్ ఈ ఘటన గురించి ప్రేక్షకులకు వివరించారు. సాధారణంగా షో ప్రారంభంలో నిల్చొని మాట్లాడే ఆయన, ఈసారి కూర్చుని కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనికి గల కారణాన్ని స్పష్టం చేస్తూ.. “నిన్న షూటింగ్ సమయంలో జారిపడటంతో నా ఎడమ మోకాలికి గాయమైంది. అందుకే నిలబడటంలో కొద్దిగా ఇబ్బందిగా ఉంది” అని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సెట్‌లోని సిబ్బంది, వైద్యులు స్పందించి ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు.
అభిమానులకు భరోసా.. ఆందోళనలో ఫ్యాన్స్
తనకు అయిన గాయం తీవ్రమైనదేమీ కాదని, కంటెస్టెంట్ల కోసం తాను తప్పకుండా నిలబడతానని అమితాబ్ ప్రేక్షకులకు భరోసా ఇచ్చారు. ఈ వయసులో కూడా ఆయన చూపుతున్న నిబద్ధతను ప్రేక్షకులు అభినందిస్తున్నప్పటికీ, ఈ ప్రమాదం జరగడంతో అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :


