☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

భారీగా తగ్గిన క్రూడాయిల్ ధరలు

Crude Oil : అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (కడి చమురు) ధరలు భారీగా పతనమయ్యాయి. అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, సౌదీ అరామ్‌కో లక్ష్యంగా హౌతీ తిరుగుబాటుదారులు...
భారీగా తగ్గిన క్రూడాయిల్ ధరలు

Crude Oil : అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (కడి చమురు) ధరలు భారీగా పతనమయ్యాయి. అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, సౌదీ అరామ్‌కో లక్ష్యంగా హౌతీ తిరుగుబాటుదారులు జరిపిన దాడుల కారణంగా ఇటీవల బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ రేటు ఏకంగా 105 డాలర్ల గరిష్ఠ స్థాయిని దాటింది. అయితే, తాజాగా ట్రేడింగ్‌లో చమురు ధరలు మళ్లీ ప్రతికూల ధోరణిని ప్రదర్శిస్తూ 100 డాలర్ల స్థాయి దిగువకు చేరుకున్నాయి. నిన్నటితో పోలిస్తే దాదాపు 6 డాలర్ల మేర క్షీణించిన బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 97.41 డాలర్లకు పడిపోగా, డబ్ల్యూటీఐ (WTI) క్రూడ్ ఆయిల్ ధర కూడా తగ్గి ప్రస్తుతం 89.66 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

Read Also : ఇరాక్‌ నుంచి అమెరికా బలగాల పూర్తి నిష్క్రమణ

India Crude Oil Imports

సరఫరా పెరుగుదలతో ధరల ఉపశమనం: మార్కెట్‌పై ప్రభావం

మిడిల్ ఈస్ట్ (మధ్యప్రాచ్యం) నుంచి క్రూడాయిల్ ఉత్పత్తి మరియు రవాణా క్రమంగా కోలుకుని వేగవంతం కావడమే ఈ ధరల తగ్గుదలకు ప్రధాన కారణమని చమురు విశ్లేషకులు పేర్కొంటున్నారు. సరఫరా సైడ్ ఆటంకాలు తొలగిపోతుండటంతో ప్రపంచ మార్కెట్లోకి చమురు సరఫరా క్రమంగా పెరుగుతోంది. ఈ పరిణామం చమురు దిగుమతులపై తీవ్రంగా ఆధారపడే భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు పెద్ద ఊరట కలిగించే అంశం. గ్లోబల్ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు తగ్గడం వల్ల ద్రవ్యోల్బణ భయాలు స్వల్పంగా తొలగి, స్థానిక పెట్రోల్, డీజిల్ ధరలపై సానుకూల ప్రభావం పడే అవకాశం ఉంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← కేబీసీ సెట్‌లో జారిపడిన అమితాబ్ బచ్చన్‌.. మోకాలికి గాయంనేటి నుండి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com