October 2026 : అక్టోబర్ 1 (2026) నుండి సామాన్య ప్రజల దైనందిన ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం చూపే పలు కీలక నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పొందే వినియోగదారులకు ఇకపై ఆధార్ బయోమెట్రిక్ అథెంటికేషన్ (Aadhaar Biometric Authentication) తప్పనిసరి కానుంది. అర్హులైన వారికే సబ్సిడీ ఫలాలు అందేలా చూడటంతో పాటు బోగస్ కనెక్షన్లను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన శాలరీ ఖాతాదారులకు ఉచిత సర్వీసుల్లో కోత విధించింది. ఎస్‌బీఐ శాలరీ అకౌంట్ కలిగిన వారు ఇతర బ్యాంకుల ఏటీఎమ్‌లలో నెలకు ఉచితంగా పొందే లావాదేవీల (Free ATM Transactions) పరిమితిని గతంలో ఉన్న 10 నుంచి 5కి తగ్గించింది. పరిమితి దాటితే అదనపు ఛార్జీలు వర్తిస్తాయి.
Read Also : కాక్‌పిట్‌లో దాడి.. ప్రాణాలకు తెగించి పోరాడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఎవరు?
డిపాజిట్లు, ఎన్‌పిఎస్ నిబంధనల్లో మార్పులు & త్వరలో యుపిఐ ఎండిఆర్ ఫ్రేమ్‌వర్క్
బ్యాంకింగ్ పారదర్శకతలో భాగంగా, రూ. 3 కోట్లు అంతకంటే ఎక్కువ మొత్తం ఉన్న బల్క్ డిపాజిట్లపై వర్తించే వడ్డీ రేట్లను బ్యాంకులు ప్రతిరోజు ఉదయం 10 గంటలలోపు తమ అధికారిక వెబ్‌సైట్లలో కచ్చితంగా పబ్లిష్ చేయాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లో కొత్తగా చేరే చందాదారులపై రూ. 200ల ఆన్‌బోర్డింగ్ ఛార్జీ వర్తించనుంది. డిజిటల్ పేమెంట్లను మరింత క్రమబద్ధీకరించే క్రమంలో, అక్టోబర్ 15 నుంచి కొత్త UPI MDR (Merchant Discount Rate) ఫ్రేమ్‌వర్క్ కూడా అమలులోకి రాబోతోంది. ఈ మార్పులన్నీ సామాన్యుల బడ్జెట్‌తో పాటు డిజిటల్ చెల్లింపుల నిర్వహణలో కీలక పాత్ర పోషించనున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :


