☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

రూ. 100 కోట్ల క్లబ్‌లో 'మండాడి'.. సూరి, సుహాస్ మూవీ టీమ్‌ను అభినందించిన కమల్ హాసన్!

రూ. 100 కోట్ల క్లబ్‌లో 'మండాడి'.. సూరి, సుహాస్ మూవీ టీమ్‌ను అభినందించిన కమల్ హాసన్!
రూ. 100 కోట్ల క్లబ్‌లో 'మండాడి'.. సూరి, సుహాస్ మూవీ టీమ్‌ను అభినందించిన కమల్ హాసన్!
రూ. 100 కోట్ల క్లబ్‌లో 'మండాడి'.. సూరి, సుహాస్ మూవీ టీమ్‌ను అభినందించిన కమల్ హాసన్!

విలక్షణ నటుడు సూరి, వర్సటైల్ యాక్టర్ సుహాస్ కలసి నటించిన 'మండాడి' చిత్రం థియేటర్లలో సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ప్రేక్షకులు, సినీ వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంటుంది. ఎల్రెడ్ కుమార్ నిర్మించిన ఈ యాక్షన్ డ్రామాను దర్శకుడు మతిమారన్ పుగళేంది అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దారు. మత్స్యకారుల జీవితాలు, ఉత్కంఠభరిత సంప్రదాయ పడవ రేసుల (పాయ్ మార పడగు) నేపథ్యంలో తెరకెక్కించారు.

సెప్టెంబర్ 10న మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా గ్రాండ్‌గా ఈ చిత్రం విడుదలైంది. తొలి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద తమిళ, తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం ఇప్పటివరకు ఏకంగా రూ. 109.25 కోట్ల మైండ్ బ్లోయింగ్ కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.

ఇప్పటికే ఈ సంచలన విజయంపై సూపర్‌స్టార్ రజినీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. లేటెస్ట్ గా లోకనాయకుడు కమల్ హాసన్ ప్రత్యేకంగా మండాడి టీమ్‌ను తన ఆఫీస్‌కు ఆహ్వానించారు. హీరోలు సూరి, సుహాస్, విలక్షణ నటుడు రవీంద్ర విజయ్, దర్శకుడు మతిమారన్‌లతో కలిసి ప్రతి ఒక్కరినీ వ్యక్తిగతంగా అభినందిస్తూ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. కథిర్ అందించిన విజువల్స్, పీటర్ హెయిన్ మార్క్ యాక్షన్ సీన్స్, జీవీ ప్రకాష్ ఇచ్చిన నెక్స్ట్ లెవెల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను కమల్ హాసన్ ప్రత్యేకంగా మెచ్చుకున్నారు.

ఈ అరుదైన గౌరవంపై నటుడు సూరి సోషల్ మీడియాలో ఎమోషనల్ అయ్యారు. "నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజు ఇది. డాక్టర్ కమల్ హాసన్ సర్ కురిపించిన ప్రేమ, ఆయన ఆశీర్వాదం మా టీమ్‌కు ఎంతో ప్రత్యేకం" అంటూ హృదయపూర్వక పోస్ట్ పెట్టారు. ఇక టాలీవుడ్ యాక్టర్ సుహాస్ స్పందిస్తూ.. "కమల్ సర్ పక్కన నిలబడటం నా జీవితంలో ఒక డ్రీమ్ కమ్ ట్రూ మోమెంట్" అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఆనందం పంచుకున్నారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్ వెట్రిమారన్ సమర్పణలో వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో ఇంకా సరికొత్త రికార్డుల వైపు పరుగులు తీస్తోంది..

html, body,
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← గణేష్ ఉత్సవాల్లో షీ టీమ్స్ ప్రత్యేక నిఘా.. 1,530 మంది అదుపులోకిబాలరాజుపల్లిలో విషాదం.. పిడుగుపాటుకు మ‌హిళ మృతి →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com