☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

బాలరాజుపల్లిలో విషాదం.. పిడుగుపాటుకు మ‌హిళ మృతి

జూలపల్లి, సెప్టెంబర్ 23 : పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం బాలరాజుపల్లిలో బుధవారం విషాదం అలుముకుంది. పిడుగుపాటుతో ఒక మ‌హిళ మృతిచెంద‌గా, మ‌రో మ‌హిళ తీవ్రంగా గాయ‌ప‌డింది.
బాలరాజుపల్లిలో విషాదం.. పిడుగుపాటుకు మ‌హిళ మృతి

జూలపల్లి, సెప్టెంబర్ 23 : పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం బాలరాజుపల్లిలో బుధవారం విషాదం అలుముకుంది. పిడుగుపాటుతో ఒక మ‌హిళ మృతిచెంద‌గా, మ‌రో మ‌హిళ తీవ్రంగా గాయ‌ప‌డింది. ఈ ఘ‌ట‌న బాల్‌రాజ్‌ప‌ల్లిలో బుధ‌వారం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాలివి.

ధర్మారం మండలం సామల పల్లి గ్రామానికి చెందిన మారం అంజమ్మ (50) అనే మ‌హిళ, కొత్తూరు గ్రామానికి చెందిన దోనూరు లక్ష్మి(45)తోపాటు మరికొంత మంది కూలీలు ఒక ఆటోలో బాలరాజుపల్లికి వ్యవసాయ పనులు చేయడానికి వచ్చారు. రైతు కుంటూరు రామయ్య పత్తి చేనులో కూలీలు పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈ స‌మ‌యంలో ఒక్కసారిగా పిడుగు ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో మారం అంజమ్మ పిడుగుపాటుకు గురై, అక్కడికక్కడే మృతి చెందింది.

దోనూరు లక్ష్మి తీవ్రంగా గాయపడింది. ఆమె కాళ్లు, చేతులు కదలలేక అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. వెంటనే ఆమెను వైద్య చికిత్సల కోసం కరీంనగర్ లోని సర్కార్ దవాఖానకు తరలించారు. అక్క‌డ ఆమెకు చికిత్స అందుతోంది. ఆమె ఆరోగ్య‌స్థితికి సంబంధించిన వివ‌రాలు తెలియాల్సి ఉంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← రూ. 100 కోట్ల క్లబ్‌లో 'మండాడి'.. సూరి, సుహాస్ మూవీ టీమ్‌ను అభినందించిన కమల్ హాసన్!George Krish | ‘జార్జ్‌ క్రిష్‌’ హీరోయిన్‌ను ఫైనల్‌ చేసిన శ్రీనువైట్ల..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com