☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Bigg Boss Today Promo : డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి ‘దక్షి’..? వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చిన నాగార్జున.. ప్రోమో వైరల్.. • General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక.. • జియో ఐపీఓతో భారీ సంచలనం.. రూ.30,213 కోట్ల సమీకరణ లక్ష్యం! 5G, AIతో భవిష్యత్తు వృద్ధికి భారీ ప్లాన్‌ • Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్! • ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! • Shubman Gill : అయ్యో.. రంజీ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్‌కు బిగ్‌షాక్‌.. ఒక్క పరుగే! సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికర చర్చ • కోటి రూపాయల కరెన్సీ నోట్లతో దుర్గమ్మకు అలంకరణ.. రావులపాలెంలో అమ్మవారిని చూసేందుకు పోటెత్తిన భక్తులు! • Ram Gopal Varma : ఆ బుక్ నన్ను బాగా మోటివేట్ చేసింది.. ఆర్జీవీ చెప్పిన ఈ పుస్తకం గురించి తెలుసా..? •

వెబ్‌ సిరీస్‌ రిలీజైన మరుసటి రోజే విషాదం.. దర్శకుడు కన్నుమూత

మలయాళ చిత్రసీమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. యువ దర్శకుడు బేల్‌రాజ్‌ కలరిక్కల్ (27) హఠాన్మరణం చెందారు. ఆయన తెరకెక్కించిన తొలి వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరుసటి రోజే ఈ విషాదం జరగడం అందరినీ కలచివేసింది. కొన్నేళ్లుగా చిత్ర పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయనకు దర్శకుడిగా మారాలనేది చిరకాల స్వప్నం. ‘కప్పి స్క్వాడ్’ (Kappi Squad) అనే వెబ్ సిరీస్‌తో ఆ కలను నెరవేర్చుకున్నారు. ఈ సిరీస్ శుక్రవారం ప్రముఖ ఓటీటీ వేదిక జియో […] The post వెబ్‌ సిరీస్‌ రిలీజైన మరుసటి రోజే విషాదం.. దర్శకుడు కన్నుమూత appeared first on Adya News Telugu.
వెబ్‌ సిరీస్‌ రిలీజైన మరుసటి రోజే విషాదం.. దర్శకుడు కన్నుమూత

మలయాళ చిత్రసీమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. యువ దర్శకుడు బేల్‌రాజ్‌ కలరిక్కల్ (27) హఠాన్మరణం చెందారు. ఆయన తెరకెక్కించిన తొలి వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరుసటి రోజే ఈ విషాదం జరగడం అందరినీ కలచివేసింది.

కొన్నేళ్లుగా చిత్ర పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయనకు దర్శకుడిగా మారాలనేది చిరకాల స్వప్నం. ‘కప్పి స్క్వాడ్’ (Kappi Squad) అనే వెబ్ సిరీస్‌తో ఆ కలను నెరవేర్చుకున్నారు. ఈ సిరీస్ శుక్రవారం ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్‌లో విడుదలైంది. తొలి ప్రయత్నంతోనే మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే ఆశ నెరవేరింది.

సిరీస్ విడుదలైన ఆనందాన్ని పూర్తిగా అనుభవించకముందే గుండెపోటు రూపంలో మృత్యువు కబళించింది. శనివారం ఆయనకు తీవ్ర గుండెపోటు వచ్చింది. ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయారు. 27 ఏళ్ల పిన్న వయసులోనే ఆయన తనువు చాలించడం కుటుంబసభ్యులను, చిత్ర పరిశ్రమను శోకసంద్రంలో ముంచింది.

బేల్‌రాజ్‌ కలరిక్కల్ వ్యక్తిగత జీవితంలోనూ ఇటీవలే ఒక ముఖ్యమైన ఘట్టం జరిగింది. ఆరేళ్లపాటు ప్రేమించిన తన ప్రియురాలిని గత నెలలోనే ఆయన వివాహం చేసుకున్నారు. కొత్త కాపురం మొదలుపెట్టిన కొద్ది రోజులకే ఈ ఘోరం జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

దర్శకుడిగా మారకముందు ఆయన ఇండస్ట్రీలో పలు విజయవంతమైన చిత్రాలకు పనిచేశారు. మలయాళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ‘నిళల్’, ‘మధురం’, ‘డాకిని’ వంటి సినిమాలకు సహాయ దర్శకుడిగా సేవలందించారు. పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడ్డారు.

తొలి సిరీస్ స్ట్రీమింగ్ ప్రారంభమైన రోజే దర్శకుడు కన్నుమూయడంపై మలయాళ సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు.

The post వెబ్‌ సిరీస్‌ రిలీజైన మరుసటి రోజే విషాదం.. దర్శకుడు కన్నుమూత appeared first on Adya News Telugu.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← పులివెందులలో ఉద్రిక్తత.. గాల్లోకి కాల్పులుభర్తను చంపిన మహిళ… కోర్టు చరిత్రాత్మక తీర్పు! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com