☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Bigg Boss Today Promo : డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి ‘దక్షి’..? వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చిన నాగార్జున.. ప్రోమో వైరల్.. • General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక.. • జియో ఐపీఓతో భారీ సంచలనం.. రూ.30,213 కోట్ల సమీకరణ లక్ష్యం! 5G, AIతో భవిష్యత్తు వృద్ధికి భారీ ప్లాన్‌ • Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్! • ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! • Shubman Gill : అయ్యో.. రంజీ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్‌కు బిగ్‌షాక్‌.. ఒక్క పరుగే! సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికర చర్చ • కోటి రూపాయల కరెన్సీ నోట్లతో దుర్గమ్మకు అలంకరణ.. రావులపాలెంలో అమ్మవారిని చూసేందుకు పోటెత్తిన భక్తులు! • Ram Gopal Varma : ఆ బుక్ నన్ను బాగా మోటివేట్ చేసింది.. ఆర్జీవీ చెప్పిన ఈ పుస్తకం గురించి తెలుసా..? •

పులివెందులలో ఉద్రిక్తత.. గాల్లోకి కాల్పులు

వైఎస్సార్ జిల్లా పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తీవ్ర ఘర్షణకు దారితీసింది. నామినేషన్ వేసేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు నేతలను సైతం ముందుకు వెళ్లకుండా నిలిపివేశారు. నామినేషన్ కేంద్రం పరిసరాల్లో పరిస్థితి వేడెక్కింది. నామినేషన్ సమయం ముగిసే వరకు అభ్యర్థులను లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారని పార్టీ నేతలు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని కుట్రలు చేస్తోందని వారు […] The post పులివెందులలో ఉద్రిక్తత.. గాల్లోకి కాల్పులు appeared first on Adya News Telugu.
పులివెందులలో ఉద్రిక్తత.. గాల్లోకి కాల్పులు

వైఎస్సార్ జిల్లా పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తీవ్ర ఘర్షణకు దారితీసింది. నామినేషన్ వేసేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు నేతలను సైతం ముందుకు వెళ్లకుండా నిలిపివేశారు.

నామినేషన్ కేంద్రం పరిసరాల్లో పరిస్థితి వేడెక్కింది. నామినేషన్ సమయం ముగిసే వరకు అభ్యర్థులను లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారని పార్టీ నేతలు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని కుట్రలు చేస్తోందని వారు మండిపడ్డారు. ఇదే సమయంలో వైఎస్సార్‌సీపీ నేతల వాహనాలపై దాడులు జరిగాయి, పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.

పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఉద్రిక్తత మరింత పెరగడంతో గాల్లోకి కాల్పులు జరిపారు. ఏకే 47 తుపాకీతో కాల్పులు జరిపారన్న వార్తలు తీవ్ర కలకలం రేపాయి. పోలీసుల చర్యలపై వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు నామినేషన్ కేంద్రం వద్ద టీడీపీ వర్గీయులు భారీగా మోహరించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడులకు యత్నించారని నేతలు ఆరోపించారు. ప్రత్యర్థులను వదిలేసి తమ పార్టీ శ్రేణులపైనే పోలీసులు ప్రతాపం చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల ఏకపక్ష వైఖరికి నిరసనగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగాయి. దీంతో పులివెందులలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది.

The post పులివెందులలో ఉద్రిక్తత.. గాల్లోకి కాల్పులు appeared first on Adya News Telugu.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← రణబాలి.. వసూళ్లు ఎంతంటే?వెబ్‌ సిరీస్‌ రిలీజైన మరుసటి రోజే విషాదం.. దర్శకుడు కన్నుమూత →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com