☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Karnataka Congress MLA resigns | కరువు ప్రాంతాల జాబితాలో తన నియోజకవర్గం లేదని.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా

Karnataka Congress MLA resigns | కరువు ప్రాంతాల జాబితాలో తన నియోజకవర్గాన్ని చేర్చకపోవడంపై కార్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి చెందారు. ప్రభుత్వానికి పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకపోకపోవడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికార పార్టీకి చెందిన ఆయన తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు.
Karnataka Congress MLA resigns | కరువు ప్రాంతాల జాబితాలో తన నియోజకవర్గం లేదని.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా

బెంగళూరు: కరువు ప్రాంతాల జాబితాలో తన నియోజకవర్గాన్ని చేర్చకపోవడంపై కార్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి చెందారు. ప్రభుత్వానికి పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకపోకపోవడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికార పార్టీకి చెందిన ఆయన తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. (Karnataka Congress MLA resigns) కర్ణాటకలోని విజయపుర జిల్లాకు చెందిన ఇండి నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే యశ్వంతరాయగౌడ పాటిల్ తన పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వానికి పదేపదే విజ్ఞప్తి చేశారు. ఫలితం లేకపోవడంతో ఆయన అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం తన ఎమ్మెల్యే సభ్యత్వానికి యశ్వంతరాయగౌడ పాటిల్ రాజీనామా చేశారు. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ జి.ఎస్. పాటిల్‌కు తన రాజీనామా లేఖను ఆయన పంపారు.

కాగా, ఖరీఫ్ సీజన్‌లో ఇండి తాలూకా తీవ్ర కరువు బారిన పడిందని యశ్వంతరాయగౌడ పాటిల్ తెలిపారు. కరువు ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ ఆగస్ట్‌ 28న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించినట్లు చెప్పారు. అయితే విజయపుర జిల్లాలోని 13 తాలూకాలలో ఇప్పటి వరకు 11 తాలూకాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారని, కేవలం ఇండి, చడచన్ తాలూకాలను మాత్రమే మినహాయించారని ఆయన విమర్శించారు.

అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రభావవంతమైన వ్యక్తులకు, ఒత్తిడి తెచ్చే పద్ధతులను అనుసరించే వారికే ప్రాధాన్యత లభిస్తోందని యశ్వంతరాయగౌడ పాటిల్ ఆరోపించారు. ‘అందువల్ల, నా నియోజకవర్గ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చలేకపోతున్నందున, నేను స్వచ్ఛందంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా’ అని రాజీనామా లేఖలో ఆయన పేర్కొన్నారు.

మరోవైపు సీఎం డీకే శివకుమార్ నేతృత్వంలోని మంత్రివర్గ విస్తరణలో తనకు చోటు దక్కకపోవడంతో యశ్వంతరాయగౌడ పాటిల్ గతంలో ఆగస్ట్‌ 3న కూడా తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే పార్టీ నాయకత్వం నచ్చజెప్పడంతో దానిని ఉపసంహరించుకున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Holiday | ఈ నెల 25న నిమజ్జనం.. ఐదు జిల్లాలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వంKTR | ‘మా గణేశుడిని మొక్కుకున్నది ఒక్కటే’.. ఖైరతాబాద్‌ వినాయకుడి సేవలో కేటీఆర్.. వీడియో →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com