☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Karnataka Contractors | పెండింగ్‌ బిల్లులు చెల్లించకపోతే కాంగ్రెస్‌ అవినీతిని బయటపెడతాం

పెండింగ్‌ బిల్లులపై కర్ణాటక కాంగ్రెస్‌ సర్కార్‌కు రాష్ట్ర కాంట్రాక్టర్లు అల్టిమేటం జారీచేశారు. డిసెంబర్‌లోగా రూ.38 వేల కోట్ల బకాయిలను చెల్లించాలని, లేదంటే ప్రభుత్వ అవినీతిని బయటపెడతామని హెచ్చరించారు. తమను అరెస్ట్‌ చేసినా లెక్కచేయబోమని స్పష్టంచేశారు. కర్ణాటక కాంట్రాక్టర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆర్‌ మంజునాథ్‌ బుధవారం మీడియాతో మాట్లాడుతూ..
Karnataka Contractors | పెండింగ్‌ బిల్లులు చెల్లించకపోతే కాంగ్రెస్‌ అవినీతిని బయటపెడతాం
  • మమ్మల్ని అరెస్ట్‌ చేసినా భయపడం
  • కాంట్రాక్టుల్లో పెచ్చరిల్లిన అవినీతి
  • 75% మంది ఎమ్మెల్యేల ‘ప్రమేయం’
  • కాంట్రాక్టర్‌ స్థాయిని బట్టి కమీషన్లు
  • కర్ణాటక కాంగ్రెస్‌ సర్కార్‌పై కాంట్రాక్టర్ల అసోసియేషన్‌ ఫైర్‌

బెంగళూరు : పెండింగ్‌ బిల్లులపై కర్ణాటక కాంగ్రెస్‌ సర్కార్‌కు రాష్ట్ర కాంట్రాక్టర్లు అల్టిమేటం జారీచేశారు. డిసెంబర్‌లోగా రూ.38 వేల కోట్ల బకాయిలను చెల్లించాలని, లేదంటే ప్రభుత్వ అవినీతిని బయటపెడతామని హెచ్చరించారు. తమను అరెస్ట్‌ చేసినా లెక్కచేయబోమని స్పష్టంచేశారు. కర్ణాటక కాంట్రాక్టర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆర్‌ మంజునాథ్‌ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోతే అన్ని జిల్లాల్లో పాదయాత్రలు చేపడతామని చెప్పారు. ప్రస్తుతం కాంట్రాక్టులలో అవినీతి పెరిగిపోయిందని, ఎమ్మెల్యేల జోక్యం మితిమీరిపోయిందని ఆరోపించారు. కాంట్రాక్టులు నిజమైన కాంట్రాక్టర్లకు కాకుండా ఎమ్మెల్యేల అనుచరులకే ఇస్తున్నారని పేర్కొన్నారు. ‘లక్షా 50వేల మంది కాంట్రాక్టర్లకు రూ.38 వేల కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. 2021-22 నుంచి పనులు చేస్తున్నా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.

ఒకప్పుడు కాంట్రాక్టర్ల విషయాల్లో ఎమ్మెల్యేల జోక్యం ఉండేది కాదు. ఎన్నికల సమయంలోనే ఎమ్మెల్యేలు మా సహాయం కోరేవారు. ఇప్పుడు 75 శాతం మంది ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుంటున్నారు. రూ.కోటి కాంట్రాక్టు నుంచి రూ.100 కోట్ల కాంట్రాక్టు దాకా మొదట మేం ఎమ్మెల్యేలతో మాట్లాడాల్సిందే. ఈ విషయం సీఎంకు తెలియదా?’ అని ఆయన ప్రశ్నించారు. ‘కమీషన్ల రూపంలో లంచాలు గత ప్రభుత్వంలోనూ ఉన్నాయి. ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. టెండర్‌ ఆమోదం నుంచి బిల్లుల చెల్లింపు వరకు అన్ని చోట్లా ముడుపులు చెల్లించాల్సిందే. కాంట్రాక్టర స్థాయిని బట్టి కమీషన్‌ మారుతుంది’ అని మంజునాథ్‌ పేర్కొన్నారు. ‘మాజీ సీఎం సిద్ధరామయ్య మాకు ఇవ్వాల్సిన డబ్బులను సంక్షేమ పథకాలకు వాడుకున్నారు. ఇప్పుడు సీఎం డీకే శివకుమార్‌ ప్రభుత్వం కూడా అదే చేస్తున్నది. సీఎం డీకే మాకు పనులు, డబ్బులు ఇవ్వబోమని చెప్పాలి. మేం విషం తాగి చనిపోతాం. మాకు వేరే మార్గం లేదు. పథకాలతో మాకు సంబంధం లేదు. మా బిల్లులు మాకు వెంటనే విడుదల చేయాలి’ అని మంజునాథ్‌ డిమాండ్‌ చేశారు.

గత బీజేపీ ప్రభుత్వం వల్లే ఈ పరిస్థితి..

కాంట్రాక్టర్ల డిమాండ్లపై సీఎం శివకుమార్‌ స్పందించారు. గత బీజేపీ ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయింపులు లేకుండా అడ్డగోలుగా కాంట్రాక్టులు ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. కాంట్రాక్టర్ల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. కాంట్రాక్టర్లు అఫిడవిట్‌ దాఖలు చేసి లంచాలు అడిగిన వారి పేర్లను వెల్లడిస్తే విచారణకు అదేశిస్తానని చెప్పారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Chandrababu | కృష్ణా నదిపై రెండు బ్యారేజీలు: చంద్రబాబుHarish rao | తెలంగాణ కరెంటు..రాజస్థాన్‌కు తాకట్టు : హరీశ్‌రావు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com