☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

తిరుమలలో కర్ణాటక సత్రాల వివాదం..

తిరుమలలో కర్ణాటక సత్రాల వివాదం.. Caption of Image. తిరుమలలో కర్ణాటక సత్రాల నిర్వహణ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. భక్తుల వసతి కోసం ఏర్పాటు చేసిన కర్ణాటక సత్రాలను పర్యాటక అభివృద్ధి సంస్థకు అప్పగించడంపై అభ్యమతరాలు వ్యక్తమవుతున్నాయి.ఏడున్నర ఎకరాల భూమిలో నిర్మించిన భవనాలకు టీటీడీ అనుమతులు ఉన్నాయా..? గత ప్రభుత్వ హయాంలో కుదిరిన ఒప్పందాలేంటి అంటూ ప్రశ్నించారు టీటీడీ పాలకమండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి. తిరుమల శ్రీవారి ఆలయానికి సమీపంలో ఉన్న కర్ణాటక ప్రవాస సౌధాలు ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారాయి. మైసూరు మహారాజుల కాలం నుంచి తిరుమలతో కర్ణాటకకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆ అనుబంధంతోనే భక్తుల వసతి కోసం కర్ణాటక సత్రాలు ఏర్పాటయ్యాయి. అయితే ఈ సత్రాల నిర్వహణ బాధ్యతలను దేవాదాయ శాఖ నుంచి కర్ణాటక పర్యాటక అభివ
తిరుమలలో కర్ణాటక సత్రాల వివాదం..
తిరుమలలో కర్ణాటక సత్రాల వివాదం..

తిరుమలలో కర్ణాటక సత్రాల నిర్వహణ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. భక్తుల వసతి కోసం ఏర్పాటు చేసిన కర్ణాటక సత్రాలను పర్యాటక అభివృద్ధి సంస్థకు అప్పగించడంపై అభ్యమతరాలు వ్యక్తమవుతున్నాయి.ఏడున్నర ఎకరాల భూమిలో నిర్మించిన భవనాలకు టీటీడీ అనుమతులు ఉన్నాయా..? గత ప్రభుత్వ హయాంలో కుదిరిన ఒప్పందాలేంటి అంటూ ప్రశ్నించారు టీటీడీ పాలకమండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి.

తిరుమల శ్రీవారి ఆలయానికి సమీపంలో ఉన్న కర్ణాటక ప్రవాస సౌధాలు ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారాయి. మైసూరు మహారాజుల కాలం నుంచి తిరుమలతో కర్ణాటకకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆ అనుబంధంతోనే భక్తుల వసతి కోసం కర్ణాటక సత్రాలు ఏర్పాటయ్యాయి.

అయితే ఈ సత్రాల నిర్వహణ బాధ్యతలను దేవాదాయ శాఖ నుంచి కర్ణాటక పర్యాటక అభివృద్ధి సంస్థకు అప్పగించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే పర్యాటక సంస్థ అధికారులు నిర్వహణ బాధ్యతలు చేపట్టేందుకు చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీంతో భక్తుల కోసం ఏర్పాటు చేసిన సత్రాలను పర్యాటక సంస్థకు అప్పగించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇదిలా ఉండగా కర్ణాటక సత్రాల నిర్వహణ మార్పుపై టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి వివరాలు కోరినట్లు సమాచారం. గతంలో కుదిరిన ఒప్పందాలు, భూమి కేటాయింపు పత్రాలు, నిర్మాణ అనుమతులను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో కర్ణాటక ప్రభుత్వం, టీటీడీ నుంచి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← హైదరాబాద్ చింతల్‌లో విషాదం.. గోల్డ్ షాప్ బయట ఆడుకుంటూ సైనైడ్ తిని రెండున్నరేళ్ల చిన్నారి మృతిKamal Haasan: ఏ బిలియనీర్ దేశ విధానాలను శాసించలేరు.. ఎలాన్ మస్క్‌కు కమల్ హాసన్ మాస్ వార్నింగ్! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com