☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Kamal Haasan: ఏ బిలియనీర్ దేశ విధానాలను శాసించలేరు.. ఎలాన్ మస్క్‌కు కమల్ హాసన్ మాస్ వార్నింగ్!

Kamal Haasan: ఏ బిలియనీర్ దేశ విధానాలను శాసించలేరు.. ఎలాన్ మస్క్‌కు కమల్ హాసన్ మాస్ వార్నింగ్!
Kamal Haasan: ఏ బిలియనీర్ దేశ విధానాలను శాసించలేరు.. ఎలాన్ మస్క్‌కు కమల్ హాసన్ మాస్ వార్నింగ్!
Kamal Haasan: ఏ బిలియనీర్ దేశ విధానాలను శాసించలేరు.. ఎలాన్ మస్క్‌కు కమల్ హాసన్ మాస్ వార్నింగ్!

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భారత్ ను ఉద్దేశించి చేసిన వ్యంగ్య వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు, ఎంపీ కమల్ హాసన్ త్రీవంగా స్పందించారు. భారత్‌లో స్టార్‌లింక్ సేవలకు లైసెన్సింగ్ ప్రక్రియలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో.. "భారత ప్రధాని అంబానీనా?" అంటూ మస్క్ చేసిన సెటైరికల్ ట్వీట్‌పై కమల్ హాసన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఏ దేశ విధానాలను ఏ బిలియనీర్ కూడా నిర్దేశించలేరని ఆయన స్పష్టం చేశారు.

ఎలాన్ మస్క్ కు కౌంటర్..

భారత్‌లో 'స్టార్‌లింక్' (Starlink) శాటిలైట్ ఇంటర్నెట్ సేవల లైసెన్సింగ్ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్.. "భారత ప్రధాని అంబానీనా?" అంటూ సోషల్ మీడియాలో సెటైరికల్ పోస్ట్ పెట్టారు. దీనిపై కమల్ హాసన్ ఎక్స్ (X) వేదికగా దీటుగా బదులిచ్చారు. "ఏ బిలియనీర్ అయినా, అది భారతీయుడైనా అమెరికన్ అయినా సరే దేశ విధానాలను శాసించలేరు. ప్రతి దేశం తన స్వలాభం, సార్వభౌమత్వం, జాతీయ భద్రత ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటుంది" అని తేల్చిచెప్పారు.

దేశకోసం రాజీ లేదు..

స్వేచ్ఛా వాణిజ్యం గురించి మాట్లాడే పశ్చిమ దేశాలు.. స్వయంగా రక్షణాత్మక విధానాలను అనుసరిస్తున్నాయని కమల్ విమర్శించారు. చైనా ఎలక్ట్రిక్ వాహనాలపై (EVs) అమెరికా ఏకంగా 100 శాతం సుంకాలు విధించి తన దేశీయ పరిశ్రమను ఎలా కాపాడుకుంటోందో గుర్తుచేశారు. అదేవిధంగా భారత్ కూడా తన దేశీయ తయారీ రంగం, వ్యూహాత్మక నెట్‌వర్క్‌లను రక్షించుకోవడంలో ఎలాంటి రాజీ పడదని తేల్చిచెప్పారు. భారత్ ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశమే తప్ప ఎవరికీ వలసపాలిత ప్రాంతం కాదని.. దేశ భవిష్యత్తును భారత ప్రజలే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు.

కమల్ కు కంగనా మద్దతు..

కమల్ హాసన్ ఇచ్చిన ఈ మాస్ కౌంటర్‌పై బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ కూడా స్పందించారు. కమల్ పోస్ట్ చాలా షార్ప్‌గా, సూటిగా, వ్యంగ్యంగా ఉందని ప్రశంసించారు. ఇది కచ్చితంగా మస్క్‌కు గట్టిగా తగిలి ఉంటుంది అంటూ కంగనా తన మద్దతు తెలిపారు. మరోవైపు, మస్క్ చేసిన ఆరోపణలను భారత కమ్యూనికేషన్ల శాఖ ఇప్పటికే నిరాధారమైనవిగా కొట్టిపారేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.


©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← తిరుమలలో కర్ణాటక సత్రాల వివాదం..ఇక వెండి రేట్లు పెరగవా? ఆల్ టైమ్ హై నుంచి 50% ఎందుకు పడింది: అసలేం జరుగుతోంది? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com