☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

గులాబీ కోటలో కవిత వేట..!

తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ప్రాంతీయ శక్తిగా ఎదగాలనే లక్ష్యంతో తెలంగాణ రక్షణ సేన పార్టీని స్థాపించిన కల్వకుంట్ల కవిత.. ఇప్పుడు తన రాజకీయ వ్యూహాలకు మరింత పదును పెట్టారు. కేవలం కాంగ్రెస్, బీజేపీలపైనే కాకుండా, ప్రధానంగా బీఆర్ఎస్ అగ్రనేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావును పొలిటికల్ గా కార్నర్ చేసే ఒక భారీ సర్జికల్ స్ట్రైక్ కు ఆమె తెరలేపినట్లు క్షేత్రస్థాయి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో హరీష్ రావు చేసిన వివిధ […] The post గులాబీ కోటలో కవిత వేట..! appeared first on Telugu Rajyam.
గులాబీ కోటలో కవిత వేట..!

తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ప్రాంతీయ శక్తిగా ఎదగాలనే లక్ష్యంతో తెలంగాణ రక్షణ సేన పార్టీని స్థాపించిన కల్వకుంట్ల కవిత.. ఇప్పుడు తన రాజకీయ వ్యూహాలకు మరింత పదును పెట్టారు. కేవలం కాంగ్రెస్, బీజేపీలపైనే కాకుండా, ప్రధానంగా బీఆర్ఎస్ అగ్రనేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావును పొలిటికల్ గా కార్నర్ చేసే ఒక భారీ సర్జికల్ స్ట్రైక్ కు ఆమె తెరలేపినట్లు క్షేత్రస్థాయి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో హరీష్ రావు చేసిన వివిధ భూ లావాదేవీలు, ఆర్థిక అక్రమాలను టార్గెట్ చేసి, వాటి చిట్టాను ప్రజల ముందుకు తెచ్చేలా కవిత పక్కా స్కెచ్ వేసినట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా టాక్ నడుస్తోంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో కవిత చేసిన వ్యాఖ్యలు ఈ విశ్లేషణకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. హరీష్ రావు భూ లావాదేవీలపై విచారణ జరిపించే దమ్ము సీఎం రేవంత్ రెడ్డికి ఉందా..? అంటూ ఆమె నేరుగానే సవాల్ విసిరారు. “రేవంత్ రెడ్డి సమస్యల్లో ఉంటే.. హరీష్ రావు వెనుక ఉండి సపోర్ట్ చేస్తాడు” అంటూ వీరిద్దరి మధ్య ఉన్న తెరవెనుక సత్సంబంధాలను ఆమె ఎండగట్టారు. అంతేకాకుండా, గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల సమస్యలను వదిలేసి వ్యక్తిగత దూషణలకు దిగారంటూ బీఆర్ఎస్ లీడర్‌షిప్‌ను కడిగిపారేశారు.

“నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి.. నాతో పెట్టుకోవద్దు, సమయం వచ్చినప్పుడు అన్నింటినీ బయటపెడతా” అంటూ హరీష్ రావు అక్రమాలను టార్గెట్ చేస్తూ ఆమె ఇచ్చిన హింట్స్ ఇప్పుడు గులాబీ గూటిలో పెద్ద అలజడి రేపుతున్నాయి. మరోవైపు, ఖైరతాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో తన తెలంగాణ రక్షణ సేన అభ్యర్థిని బరిలోకి దించుతున్నట్లు కవిత ప్రకటించడం ఈ పొలిటికల్ వేటకు మరింత మైలేజ్ తెచ్చిపెట్టింది.

ఒకవైపు క్షేత్రస్థాయిలో పార్టీ ఉనికిని చాటుకుంటూనే.. మరోవైపు హరీష్ రావు గత పాలనలోని అక్రమాలను, వైఫల్యాలను బహిరంగంగా ఎండగట్టడం ద్వారా బీఆర్ఎస్ సాంప్రదాయ ఓటు బ్యాంక్‌ను, ముఖ్యంగా యువత, మహిళా ఓటర్లను తన వైపు తిప్పుకోవాలని కవిత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. సొంత పార్టీ పెట్టిన తర్వాత కవిత ఏమాత్రం తగ్గకుండా.. హరీష్ రావు సమాంతర రాజకీయాలను, అక్రమాలను టార్గెట్ చేస్తూ వేట మొదలుపెట్టడం బీఆర్ఎస్ శ్రేణులను తీవ్ర ఆత్మరక్షణలోకి నెట్టింది. మరి కవిత విసురుతున్న ఈ రాజకీయ అస్త్రాలను తట్టుకుని హరీష్ రావు తన ఉనికిని ఎలా కాపాడుకుంటారు..? ఈ ఇద్దరి మధ్య నడుస్తున్న అంతర్గత అక్రమాల పోరు రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలను ఎటు వైపు తిప్పుతుందనేది అత్యంత ఆసక్తికరంగా మారింది.

The post గులాబీ కోటలో కవిత వేట..! appeared first on Telugu Rajyam.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ఖైరతాబాద్ బైపోల్ లో పోటీ చేద్దాం ప్లీజ్..!వైసీపీ కోటపై సాయిరెడ్డి సర్జికల్ స్ట్రైక్..? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com