☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
నరసాపురం మున్సిపాలిటీపై కూటమి జెండా ఎగరేస్తాం! • Gold-Silver Prices Today : పండుగ వేళ బంగారం ధరల్లో కీలక మార్పులు.. తులం రేటు ఎంతంటే? • దసరా తర్వాతే పట్టాలెక్కే ఛాన్స్ • ఘోర ప్రమాదం: కాలువలో పడిన మినీ బస్సు.. 8 మంది మృతి • అబ్బా వీటిని అనవసరంగా లైట్‌ తీసుకున్నామే.. జుట్టురాలడానికి అసలు కారణం ఈ అలవాట్లేనా? • Vaibhav Sooryavanshi: గంభీర్ ఛాన్స్ ఎప్పుడు ఇస్తారు? వైభవ్ సూర్యవంశీ రెండు పదాలతో చెప్పిన సమాధానం ఇదే • Tesla: ఫ్లయింగ్ కారు కేవలం శాంపిల్ మాత్రమే.. మస్క్ నెక్ట్స్ ఈ మూడు ప్రాజెక్టుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! • ట్రంప్ కీలక నిర్ణయం.. రష్యాపై చమురు ఆంక్షల్లో మినహాయింపులు? •

Kavya & Anirudh | పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కావ్యా మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్!

Kavya Maran and Anirudh Ravichander | సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) సీఈఓ కావ్యా మారన్, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ వివాహం చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు ఎట్ట‌కేల‌కు చెక్ ప‌డింది.
Kavya & Anirudh | పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కావ్యా మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్!

Kavya Maran and Anirudh Ravichander | సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) సీఈఓ కావ్యా మారన్, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ వివాహం చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు ఎట్ట‌కేల‌కు చెక్ ప‌డింది. తాజాగా వీరిద్ద‌రూ ఒక‌టి కాబోతున్న‌ట్లు కావ్య తండ్రి క‌ళానిధి మార‌న్ తెలిపాడు. పెళ్లి వేడుక యూర‌ప్‌లో జ‌రుగ‌బోతుండ‌గా.. నవంబర్ 21న చెన్నైలో వీరి వివాహ రిసెప్షన్ అత్యంత వైభవంగా జరగనున్నట్లు సమాచారం. ఈ వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రికల అందజేత కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైంది.

ఇందులో భాగంగా సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్, ఆయన సతీమణి కావేరి మారన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఈ ఆహ్వానానికి సంబంధించిన వివరాలను అధికారికంగా ధృవీకరించడంతో ఈ వార్త రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అలాగే ఈ వేడుకకు మరికొంతమంది ప్రముఖ రాజకీయ, సినీ ప్రముఖులను కూడా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. మరోవైపు చెన్నైలో నవంబర్ 21న రిసెప్షన్ జరగనుండగా, అసలు వివాహం నవంబర్ 11న గ్రీస్‌లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా జరగనుందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇరు కుటుంబాల నుంచి ఇంకా పూర్తి స్థాయి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. వ్యాపార దిగ్గజ కుటుంబానికి చెందిన కావ్యా మారన్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఒక్కటవుతుండటంతో ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Chaminda Vaas: ఢిల్లీ క్యాపిట‌ల్స్ బౌలింగ్ కోచ్‌గా చామిండ వాస్‌Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com